Kohinoor: ‘కోహినూర్’ విషయంలో బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం.. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలే కారణమా..?
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని..
![Kohinoor: ‘కోహినూర్’ విషయంలో బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం.. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలే కారణమా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/kohinoor-and-queet-of-britain-camilla-parker-bowles.jpg?w=1280)
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని ధరించకూడదని నిర్ణయించింది. ఈ కిరీటానికి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని చార్లెస్-3 భార్య కెమిల్లా ధరించనున్నారు. పట్టాభిషేకం సమయంలో రాణి కెమిల్లా కిరీటధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని ధరించాలని తొలుత భావించినప్పటికీ.. చివరకు ఆ ఆలోచనను పక్కనపెట్టారు రాజవంశీయులు. ఈ నిర్ణయంతో క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఈ కిరీటంలో క్వీన్ ఎలిజబెత్-2కి చెందిన నగలను కూడా పొదగనున్నారు.
ఇక క్వీన్ ఎలిజబెత్-2 కిరీటంలో కోహినూర్ వజ్రం ఉండేదని మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అంటే.. ఎలిజబెత్-2 మరణించే రోజు దాకా ఆమె కిరీటంలో ఈ కోహినూర్ వజ్రం ఉంది. కోహినూర్ వజ్రం మన దేశానికి చెందినది అనే విషయం మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ కోహినూర్ మన ఆంధ్రప్రదేశ్‌లోనే లభ్యమైంది. ఈ నేపథ్యంలోనే భారత్‌తో దౌత్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే కోహినూర్‌ను ధరించకూడదని రాణి కెమిల్లా, ఇంకా బ్రిటన్ రాజవంశీయులు నిర్ణయించినట్టు సమాచారం.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/team-india-12.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/moto-m13-6-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/6-tips-for-hair-care.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/ginger-for-hair-and-skin.jpg)
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..