Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger Benefits: రుచికే కాదు, అందం కోసం కూడా అల్లం ప్రయోజనకరమే.. మరి ఎలా వాడాలో తెలుసా..? ఆ వివరాలు మీ కోసం..

అల్లంలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల ఉన్న కారణంగా ఇది...

Ginger Benefits: రుచికే కాదు, అందం కోసం కూడా అల్లం ప్రయోజనకరమే.. మరి ఎలా వాడాలో తెలుసా..? ఆ వివరాలు మీ కోసం..
Ginger For Health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 14, 2023 | 8:55 PM

మన దేశంలో అల్లం అంటే తెలియనివారు ఉండనే ఉండరంటే అతిశయోక్తి కాదు. వంటలలో ప్రధానంగా ఉపయోగించే అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం కూడా లేదు. వంటలలోనే కాక ఆయుర్వేదంలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. అయితే అల్లంతో చర్మ సంరక్షణ, సౌందర్యం కూడా సాధ్యమని మీకు తెలుసా..? నిత్యం దీన్ని తినడం వల్ల సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. చర్మం, జుట్టు సంరక్షణలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అల్లంలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల ఉన్న కారణంగా ఇది స్కిన్, హెయిర్ కేర్ ప్రొడక్ట్‌గా కూడా ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలను వృద్ధి చేస్తూ, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే అల్లం ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. మెరిసే చర్మం: అల్లంలో జింజెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సిడేషన్ స్ట్రెస్‌తో పోరాడి, స్కిన్ టోన్‌ను మెరుగుపరిచి చర్మం మెరిసేలా చేస్తుంది. అల్లం ముక్కలను చూర్ణంలా చేసి ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది ముఖ చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు మచ్చలతో పోరాడుతుంది. ఇలా చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది.
  2. జుట్టు పెరుగుదల: అల్లం తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది నేచురల్ కండిషనర్‌గా పనిచేస్తూ జుట్టును సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. అల్లం జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. హెయిర్ రూట్, ఫోలికల్స్‌ను దృఢంగా మారుస్తుంది. అల్లంలో ఉండే అనేక ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు వెంట్రుకలను బలంగా మారుస్తూ జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.
  3. మచ్చలు మాయం: అల్లం యాంటీఆక్సిడెంట్లకు నిలయం. ఇవి టోనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. చర్మం రంగు కంటే తక్కువ రంగులో ఉండే మచ్చలను అల్లం దూరం చేస్తుంది. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల కారణంగా ఏర్పడే మంట, మచ్చలను తగ్గిస్తాయి. ఈ సూపర్‌ఫుడ్ సహజమైన పదార్ధం. ఇది చర్మం సాగే గుణాన్ని మెరుగుపరుస్తూ, మృదువుగా చేస్తుంది.
  4. ముడతల నివారణ: అల్లం యాంటీఆక్సిడెంట్స్‌కు నిలయం. ఇది ముడతలను నివారిస్తుంది. అల్లం ఎలాస్టిన్ రెసిస్టెన్స్‌ను అడ్డుకుంటూ.. ముడతలు, ఫైన్ లైన్స్‌కు చెక్ పెడుతుంది. ఇలాంటి స్కిన్ కేర్ ప్రయోజనాలను పొందేందుకు తాజా అల్లంను వంటలో ఉపయోగించాలి. ఇది హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంతో పాటు రక్త ప్రసరణను ప్రేరేపించడం ద్వారా చర్మం రూపాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం మరిన్ని పోషకాలను పొందేలా చేస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. చుండ్రు సమస్యకు చెక్: చుండ్రును అల్లంతో కూడా నయం చేయవచ్చు. ఇందులోని క్రిమినాశక గుణాలు.. నేచురల్ ఈస్ట్, చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. అల్లం నూనెను వారానికి రెండుసార్లు తలకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల చుండ్రు రాకుండా చూసుకోవచ్చు.