Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haircare Tips: ఒత్తైన జుట్టు కోరుకుంటున్నారా..? అయితే ఈ 6 చిట్కాలు మీ కోసమే.. వాడితే హెయిల్ ఫాల్‌కు కూడా చెక్ పెట్టినట్లే..

ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మనలో చాలా మంది ప్రధానంగా చర్మ, జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకా వీటిలో జుట్టు రాలిపోవడం, చుండ్రు..

Haircare Tips: ఒత్తైన జుట్టు కోరుకుంటున్నారా..? అయితే ఈ 6 చిట్కాలు మీ కోసమే.. వాడితే హెయిల్ ఫాల్‌కు కూడా చెక్ పెట్టినట్లే..
6 Tips For Hair Care
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 14, 2023 | 9:19 PM

ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మనలో చాలా మంది ప్రధానంగా చర్మ, జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకా వీటిలో జుట్టు రాలిపోవడం, చుండ్రు చాలా ఇబ్బందికరమైన సమస్యలు. అయితే కొందరిలో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. మందుల నుంచి హార్మోన్ల అసమతుల్యత వరకు మీరు తీసుకునే ఆహారం, పని ఒత్తిడి ఇలా వివిధ కారణాల వల్ల జట్టు దారుణంగా రాలిపోతుంది. అయితే జుట్టు సమస్యలను అధిగమించడానికి, ఇంకా జుట్టు శరవేగంగా పెరిగేలా చేయడానికి అనేక రకాల సహజ పద్ధతులను అవలంబించవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. మరి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఆ సులభమైన చిట్కాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే చిట్కాలు:

  1. మెంతికూర: జుట్టు పెరుగుదల కోసం మెంతులను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఒక మెత్తని పేస్ట్ అయ్యే వరకు గ్రైండర్‌లో ఒక టేబుల్ స్పూన్ ఈ హెర్బ్, నీరు కలపండి. దానికి కొద్దిగా కొబ్బరి నూనె వేసి మీ జుట్టుకు అప్లై చేయాలి. అలా అరగంట పటు ఉండనివ్వాలి. ఆ తరువాత మంచినీటితో శుభ్రపరుచుకోవాలి.
  2. ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ రసం జుట్టు రాలిపోవడాన్ని ఎంతో మెరుగ్గా నివారిస్తుంది. ఇందులో సల్ఫర్ ఉండడం వల్ల ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. తద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇక ఉల్లిపాయ రసం ఉపయోగించడానికి ముందుగా ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి దాని రసాన్ని పిండాలి. లేదా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తరువాత దాన్ని తలకు 10 నుంచి 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. కాసేపటి తరువాత షాంపుతో తలను శుభ్రం చేసుకోవాలి.
  3. ఎగ్ మాస్క్: గుడ్లలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇందులో సల్ఫర్, జింక్, ఐరన్, సెలీనియం, భాస్వరం, అయోడిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎగ్ ప్యాక్ కోసం.. ఒక గిన్నెలో ఒక గుడ్డులోని తెల్లసొనను వేరు చేసి, ఒక టీస్పూన్ ఆలివ్ నూనె, తేనె కలపండి. దీన్ని పేస్ట్ లా చేసి, మీ జుట్టు, తలకు అప్లై చేయాలి. దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
  4. కొబ్బరి పాలు: కొబ్బరి పాలు సహజంగా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇందులో ఐరన్, పొటాషియం పుష్కలంగా వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం ముందుగా తాజా కొబ్బరి నుంచి కొబ్బరి పాలను తీయాలి. అందులో సగం నిమ్మకాయను పిండి.. 4 చుక్కల లావెండర్ నూనెను కూడా కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేసిన తరువాత 4-5 గంటలు అలాగే ఉంచి, తర్వాత కడిగేయండి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఆపిల్ సైడర్ వెనిగర్: ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ తలను, జుట్టును శుభ్రపరుస్తుంది. జుట్టు పిహెచ్ బ్యాలెన్స్‌ని కూడా నియంత్రిస్తుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. అందుకోసం నీటిలో కాస్త వెనిగర్ కలిపి జట్టుకు అప్లై చేయాలి. తల ఆరిన తర్వాత తల స్నానం చేస్తే సరి.
  7. గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మీ తలకు గ్రీన్ టీని అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..