Amla Side Effects: ఈ వ్యక్తులు ఉసిరిని అస్సలు తినకూడదు.. తింటే లాభానికి బదులు ఆరోగ్యానికి నష్టమే..!

ఉసిరిలోని పోషకాలు మన శరీర రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే కొన్ని రకాల సమస్యలకు కలిగినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ

Amla Side Effects: ఈ వ్యక్తులు ఉసిరిని అస్సలు తినకూడదు.. తింటే లాభానికి బదులు ఆరోగ్యానికి నష్టమే..!
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఆమ్లాలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి. వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత, కంటిశుక్లం నిరోధించడంలో సహాయపడవచ్చు.
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 15, 2023 | 9:25 PM

Amla Side Effects: ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇదే కాక దీనిలో అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఉసిరిని ఆయుర్వేదంలో ఒక వరంలా భావిస్తారు. ఇందులోని పోషకాలు మన శరీర రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే కొన్ని రకాల సమస్యలకు కలిగినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉసిరిని తినకూడదు. ఆదమరిచి తిన్నా కూడా ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఏయే సమస్యలతో ఉన్నవారు ఉసిరిని తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. కాలేయ సమస్యలు: కాలేయ సమస్యలతో బాధపడేవారు ఉసిరిని తినకూడదు. ఒకవేళ తినాలంటే చాలా తక్కువ పరిమాణంతోనే తీసుకోవాలి. దీన్ని తినడం వల్ల కాలేయ ఎంజైమ్‌ల స్థాయి పెరిగి తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.
  2. శస్త్ర చికిత్స: శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వ్యక్తులు ఉసిరిని తినకూడదు. దీన్ని తినడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే సర్జరీకి కనీసం 2 వారాల ముందు నుంచి కూడా ఉసిరి తినకూడదని వైద్యులు చెబుతారు.
  3. కిడ్నీ సమస్యలు: ఏదైనా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడేవారు ఉసిరికాయ తినడం మంచిది కాదు. దీన్ని తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరిగి మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. తద్వారా కిడ్నీ సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
  4. లో షుగర్: తరచుగా రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే వ్యక్తులు, యాంటీ-డయాబెటిక్ ఔషధం తీసుకునే వ్యక్తులు ఉసిరిని తినకూడదు.
  5. ఇవి కూడా చదవండి
  6. గర్భిణీలు: గర్భిణీలు కూడా ఉసిరికాయ తినకూడదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలలో దీని లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ న్యూస్   కోసం ఇక్కడ క్లిక్ చేయండి..