Beauty with Neem: చర్మ సమస్యలకు చెక్ పెట్టే వేప.. వాడితే ముఖ సౌందర్యం, ఇంకెన్నో ప్రయోజనాలు కూడా..!
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వేప ఆకులతో చర్మాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ..
మన ఇంటి చుట్టు పక్కల కనిపించే మొక్కలు. చెట్లలో వేప చెట్టు ప్రధానమైనది. ఎన్నో ఔషధ గుణాలున్న వేపకు ఆయుర్వేదంలో ఎంతో గొప్ప స్థానం ఉంది. వేపలోని ఔషధాల కారణంగానే నేటికీ పల్లెటూర్లలో వేప పుల్లలనే బ్రష్‌లుగా వాడుతున్నారు. ఇంకా దోమల నివారణకు కూడా వేప ఆకుల పొగను ఉపయోగిస్తుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వేప ఆకులతో చర్మాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్, యాంటీఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మ సంరక్షణలో మెరుగ్గా పనిచేస్తాయి. అందుకే అనేక శతాబ్దాలుగా వేపను సౌందర్య సాధనాల్లో, ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు. జిడ్డు చర్మాన్ని తగ్గించడానికి వేప చక్కగా పనిచేస్తుంది. గాయాల కారణంగా ఏర్పడే ఇన్ఫెక్షన్లను తగ్గించి చర్మానికి హాని కలగకుండా చేస్తుంది. చర్మ సౌందర్యం మెరుగుపరచడానికి కూడా వేప బాగా పనిచేస్తుంది. మరి వేపతో చర్మానికి కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వేప వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు:
- వేప చర్మానికి హానికరమైన యూవీ కిరణాలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్, ముడతలు, మొటిమలను నయం చేయడానికి సహాయపడుతుంది.
- చర్మాన్ని తక్షణమే కాంతివంతంగా మార్చే శక్తి వేపకు ఉంది. దురదలు, మంటలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి వేపాకు పేస్ట్ రాసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు.
- ఎర్రగా మారిన చర్మాన్ని నయం చేయడానికి వేప చక్కగా పనిచేస్తుంది. డెలివరీ తర్వాత బాలింతలు వేప పేస్ట్‌ను శరీరానికి అప్లై చేసుకొని స్నానం చేయడంతో చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
- మొటిమలు, మచ్చలను తగ్గించి ముఖాన్ని అందంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది వేప. వేప పేస్ట్ ముఖంపై ఏర్పడే మృత కణాలను కూడా తొలగిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఇది నివారిస్తుంది.
- చుండ్రు సమస్యలు, జుట్టు సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది. వేపతో తయారయ్యే సబ్బులతో స్నానం చేసేవారు కోమలంగా, యవ్వనత్వంతో కనిపిస్తారు. చర్మంపై ఎలాంటి సమస్యలు ఉన్నా వేపాకులు పోగొడతాయి.
- ఆయిలీ స్కిన్ కలిగిన వారికి వేప నూనె మంచి పరిష్కారం. అదేవిధంగా డ్రై స్కిన్‍కి మాయిశ్చరైజర్‌లా కూడా పనిచేస్తుంది ఈ వేప పేస్ట్. వేపాకుల పేస్టుతో స్నానం చేస్తే చర్మం మెరుస్తుంది. అందుకోసం వేప పేస్టులో కొద్దిగా రోజ్ వాటర్, గంధపు పొడి, ఆలివ్ ఆయిల్, లేదా కమలాపండు తొక్కల పొడి కలిపితే రకరకాల చర్మవ్యాధులు తొలగిపోతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..