Vitamin D: విటమిన్-డితో డయాబెటిస్‌కు లింకేంటి.. కొత్త అధ్యయనంలో నమ్మలేని నిజాలు..!!
భారత్‌లో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. జీవనశైలిలో మార్పులు..మారుతున్న ఆహారపు అలవాట్లు, శ్రమ తగ్గడం వెరసి రోగాల బారిన పడుతున్నారు.

భారత్‌లో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. జీవనశైలిలో మార్పులు..మారుతున్న ఆహారపు అలవాట్లు, శ్రమ తగ్గడం వెరసి రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధికి ఇవన్నీకారణం అవుతున్నాయి. అయితే విటమిన్ డి, టైప్ 2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. టప్ట్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు విటమిన్ డి తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
డయాబెటిస్ సోకే పరిస్థితుల్లో ప్రీడయాబెటిక్ స్టేజీలో ఉన్న పెద్దల్లో విటమిన్ డి తీసుకున్నట్లయితే షుగర్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ప్రీ డయాబెటిక్ స్టేజీ అనేది రక్తంలో చక్కర ఎక్కువగా ఉన్నప్పటికీ టైప్ 2 డయాబెటిస్‌గా నిర్ధారించలేని స్థితి. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఓ కథనం ప్రకారం క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ చేసింది. సూర్యరశ్మి ద్వారానే విటమిన్ డి శరీరానికి అధిక మొత్తంలో అందుతుంది. కొవ్వులో కరిగే విటమిన్ అయిన విటమిన్ డి, ఇన్సులిన్, గ్లూకోజ్ జీవక్రియల సంబంధాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది.
అయితే రక్తంలో విటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం అయ్యింది. ప్రీడయాబెటిక్ స్టేజీలో ఉన్న పెద్దల్లో విటమిన్ డి , టైప్ 2 డయాబెటిక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. 3 సంవత్సరాల కాలంలో చేసిన ఓ రీసెర్చ్ ప్రకారం విటమిన్ డి తీసుకున్న 15వాతం డయాబెటిస్ ప్రమాదం తగ్గినట్లు తేలింది. వాస్తవానికి అధిక మొత్తంలో కూడా విటమిన్ డి తీసుకుంటే చెడు ఫలితాలు ఉంటాయని వెల్లడించింది. అయితే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే విటమిన్ డి వాటడం ప్రారంభిస్తే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




రాబోయే రోజుల్లో భారత్‌ను ప్రపంచ మధుమేహ రాజధానిగా పరిగణించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో టైప్ 2 డయాబెటిస్ తో 77మిలియన్ల మంది బాధపడుతున్నట్లు తేలింది. ప్రీ డయాబెటిక్స్ ఎక్కువగా ఉన్నందున ఈ సంఖ్య 2045 నాటికి 134మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం ప్రీ డయాబెటిస్ ప్రాబల్యం చాలా రాష్ట్రాల్లో మధుమేహం కంటే ఎక్కువగా ఉందని తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 5.8శాతం, 14.7శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు భారత్ లో విటమిన్ డి లోపంతో చాలా మంది బాధపడుతున్నట్లు గుర్తించారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..