AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cuddapah Almond: ఈ పండ్లు తిన్న తర్వాత గింజలు అస్సలు పడేయకండి.. వీటి ధర బంగారంతో సమానం..

గుండెను దృఢంగా ఉంచుతుంది. ఈ డ్రై ఫ్రూట్ మూలం భారతదేశం. ఇది పూర్తి స్థాయి ఇండియన్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. దాని పండు కూడా చాలా తీపి, ఆరోగ్యానికి మేలు..

Cuddapah Almond: ఈ పండ్లు తిన్న తర్వాత గింజలు అస్సలు పడేయకండి.. వీటి ధర బంగారంతో సమానం..
Chiranji
Sanjay Kasula
|

Updated on: Feb 17, 2023 | 11:10 AM

Share

వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే డ్రై ఫ్రూట్స్ పండిస్తారు. అయితే మొర్రి పండ్లు చల్లని వాతావరణం అవసరం లేని డ్రై ఫ్రూట్. ఇది బరువులో తక్కువ, పరిమాణంలో చిన్నది, కానీ లక్షణాలలో గొప్పదిగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది. గుండెను దృఢంగా ఉంచుతుంది. ఈ డ్రై ఫ్రూట్ మూలం భారతదేశం. ఇది పూర్తి స్థాయి ఇండియన్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. దాని పండు కూడా చాలా తీపి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆ తర్వాత గ్రామస్తులు దాని మొర్రి పండ్లను పగలగొట్టి లోపల ఉన్న గింజల నుంచి చిరోంజిని తీస్తారు. ఈ విత్తనం నుంచి చిరోంజిని లేదా సారా పలుకులు తీయడానికి చాలా కష్టపడాల్సి ఉన్నప్పటికీ, చిరోంజి చాలా ఖరీదైన అటవీ ఉత్పత్తి. దాని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

అడవిలో లభించే పండ్లు అన్నింటిలో ఇదే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ అని చెప్పవచ్చు. మొర్రి పండ్లు అత్యంత ఖరీదైన అటవీ ఉత్పత్తి, దేశంలో తయారయ్యే 70% స్వీట్‌లలో చిరోంజి లేదా సారా పలుకుల ఉపయోగిస్తుంటారు. అలాగే, అది లేకుండా ఖీర్, హల్వా రుచి ఉండదు.

వాస్తవానికి చిరోంజిని డ్రై ఫ్రూట్స్ లాగా ఉపయోగిస్తారు. దీని వినియోగం అనేక వ్యాధులను నివారిస్తుంది. చిరోంజి గింజలో 50% కంటే ఎక్కువ నూనె ఉంటుంది. దీనిని చిరోంజి ఆయిల్ అని పిలుస్తారు. దీనిని సౌందర్య, వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పండుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆదిలాబాదు, శ్రీకాకుళం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా దొరికే పండు ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్గడ్, మహారాష్ట్ర అడవి ప్రాంతాల్లో అధికంగా ఉండే జిల్లాల్లో గిరిజన పంటగా మొర్రి పండ్లును చెప్పవచ్చు. అడవి ప్రాంతాల్లోని పెరిగే  ఈ చెట్ల నుంచి ఈ పండ్లను సేకరిస్తారు గిరిజనులు. గిరిజనులకు ఇదే ప్రధాన ఆదాయ వనరు అని చెప్పవచ్చు.