Nara Lokesh: కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.. నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ఎంట్రీ
మధ్యాహ్నం 12 గంటలకు పీవీఆర్ గార్డెన్స్ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్ పాల్గొననున్నారు. అనంతరం అక్కడే లంచ్ బ్రేక్ తీసుకోనున్నారు. మధ్యాహ్నం 3.05 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యువగళం పాదయాత్రలో భాగంగా 22వ రోజు తిరుపతి జిల్లాలోని కేవీబీ పురం మండలంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. బైరాజు కండ్రిగ నుంచి లోకేష్ పాదయాత్రను మొదలు పెట్టారు. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ ఉదయం 9 గంటలకు పార్టీ సీనియర్లతో సమావేశం అయ్యారు. అనంతరం 10 గంటలకు కొత్తకండ్రిక వద్ద రైతులతో సమావేశమయ్యాడు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివనాథపురం వద్ద పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. 11.30 గంటలకు రాజీవ్ నగర్ పంచాయతీ టిడ్కో హౌసెస్ వద్ద నిరుద్యోగులు, టిడ్కో లబ్ధిదారులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు పీవీఆర్ గార్డెన్స్ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్ పాల్గొననున్నారు. అనంతరం అక్కడే లంచ్ బ్రేక్ తీసుకోనున్నారు. మధ్యాహ్నం 3.05 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. నారా లోకేష్ పాదయాత్ర నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఏపీలో ప్రజల మధ్య ప్రజల కష్టలను స్తానిక పరిస్థితులను తెలుసుకునేందుకు లోకేష్ చేపట్టిన పాదయాత్ర 400 రోజులు, 4వేల కిలో మీటర్లు సాగనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా వరకు చేయనున్నారు. అయితే ఇప్పటి వరకూ లోకేష్ పాద యాత్ర ఇప్పటి వరకు 278.5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.



మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
