AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంతపురం జిల్లా పెదపప్పూర్ ఇసుక రీచ్‌లో తనిఖీలు చేస్తుండగా అధికారులు షాక్.. చాగల్లు రిజర్వాయర్‌ గేట్లు ఎత్తివేసిన ఇసుక మాఫియా

అక్కడంతా వారి రాజ్యమే. వారు ఆడింది ఆట- పాడింది వేలం పాట. అందినకాడికి తొవ్వుకుంటారు.. అందినకాడికి దోచుకుంటారు. తామె స్వయంగా ఇసుక రీచుల పేరుతో అడ్డదారిలో దోచుకుంటారు. అంతా మా ఇష్టం అంటారు. వీరికి అడ్డొస్తే ఇలా చేస్తారు..

అనంతపురం జిల్లా పెదపప్పూర్ ఇసుక రీచ్‌లో తనిఖీలు చేస్తుండగా అధికారులు షాక్.. చాగల్లు రిజర్వాయర్‌ గేట్లు ఎత్తివేసిన ఇసుక మాఫియా
Chitravathigates
Sanjay Kasula
|

Updated on: Feb 17, 2023 | 12:58 PM

Share

ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం జిల్లాలో గత కొంతకాలంగా సాగుతోన్న ఆందోళనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పెద్దపప్పూరు మండలంలోని పెన్నా నదిలోని ఇసుక రీచ్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సెబ్, గనులు, భూగర్భ శాఖ, పోలీసు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గత వారం రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇసుక రీచ్ ను తన అనుచరులతో సందర్శించిన జెసి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం పైన, జిల్లా యంత్రాంగం పైన గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని జెసి ఆరోపించారు. ఇసుక రీచ్ ను పర్యవేక్షించాల్సిన మానిటరింగ్ కమిటీ లో కలెక్టర్ సహా 13 మందికి జెసి ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా నోటీసులు పంపించారు. మనుషులతో తక్కువ మోతాదులో ఇసుక తరలించాల్సి ఉండగా యంత్రాలతో నిత్యం దోపిడీ జరుగుతుందని ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఎట్టకేలకు స్పందించిన జిల్లా యంత్రాంగం ఇవాళ తనిఖీలు చేపట్టింది.

మరోవైపు చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నానదిలోకి నీరు వదలడం అనుమానాలకు తెరలేపింది. అధికారులు తనిఖీ నిర్వహిస్తుండగా చాగల్లు డ్యామ్‌ గేట్లు ఎత్తివేయడం వివాదాస్పదంగా మారింది. ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతం పూర్తిగా నీటితో మునిగిపోవడంతో అధికారుల తనిఖీలకు ఆటంకం ఏర్పడింది. నీళ్ళు ఎవరు వదిలారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు