AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: మనిషినైనా, ఎంత పెద్ద జంతువునైనా మింగగలవు.. ఒకేసారి 3 గ్రామంలోకి..

ఆ గ్రామంలో కొండ చిలువలు హల్‌చల్‌ చేశాయి. ఏకంగా మూడింటిని చంపేశారు గ్రామస్తులు. ఆ చుట్టుపక్కల ఇంకా ఎన్ని ఉన్నాయో అన్న భయం మాత్రం వెంటాడుతోంది.

Vizianagaram: మనిషినైనా, ఎంత పెద్ద జంతువునైనా మింగగలవు.. ఒకేసారి 3 గ్రామంలోకి..
Pythons
Ram Naramaneni
|

Updated on: Feb 17, 2023 | 11:20 AM

Share

అడవిలో తిరగాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. విజయనగరం జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామంలో తిరుగుతున్న పాములు ఎక్కడ ఇళ్లలోకి వస్తాయోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.  తాజాగా ఎం.లింగాలవలసలో 3 పెద్ద.. పెద్ద కొండ చిలువలు దడ పెట్టించాయి. ఊళ్లోకి ఒకేసారి మూడు భారీ కొండచిలువలు రావడంతో గ్రామస్థలు హడలిపోయారు. మనిషికూడా మింగేసేంత సైజులో ఉన్న భారీ కొండచిలువలు చూసి స్టన్ అయ్యారు. పదుల సంఖ్య జనాలు వాటిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపేశారు.

ఎక్కువగా గుబురుగా ఉండే పంటల్లో, దట్టమైన పొదల్లో కొండ చిలువలు తిష్టవేస్తాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. పంట కోసేటప్పుడు కాస్తా శబ్ధం చేస్తూ ముందుకు వెళ్లాలన్నారు. లేదంటే విషసర్పాల కాటుకు గురి కావాల్సి వస్తుందన్నారు. అయితే కొండ చిలువను నిర్దాక్షణ్యంగా చంపడంపై యానిమల్ లవర్స్ ఫైర్ అవుతున్నారు. అవి కనిపించినప్పుడు స్నేక్ క్యాచర్స్ లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి కానీ.. నోరు లేని జీవాలను గుమికూడి చంపడంపై సీరియస్ అవుతున్నారు.

కొండచిలువలు మనుషులను తినడం చాలా అరుదు. అవి బలంగా చుట్టేయటం ద్వారా ఊపిరి ఆడకపోవడం కానీ గుండె కొట్టుకోవటం ఆగిపోవటం కానీ జరుగుతుంది. ఎంత పెద్ద జంతువునైనా మింగటానికి వీలుగా సాగేలా వాటి దవడల నిర్మాణం ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చచ్చాం రోయ్.! మ్యాచ్ దొబ్బడానికి ఆ రెండు ఓవర్లు గ్యారంటీనట..
చచ్చాం రోయ్.! మ్యాచ్ దొబ్బడానికి ఆ రెండు ఓవర్లు గ్యారంటీనట..
మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి..
మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి..
దుబాయ్‌లో చిక్కుకున్నవారికి సాయం చేస్తానంటున్న సోనూసూద్
దుబాయ్‌లో చిక్కుకున్నవారికి సాయం చేస్తానంటున్న సోనూసూద్
బాత్రూమ్‌లో వాడే బక్కెట్లు, మగ్గులు ఇలా క్లీన్ చేయండి..మెరుస్తాయి
బాత్రూమ్‌లో వాడే బక్కెట్లు, మగ్గులు ఇలా క్లీన్ చేయండి..మెరుస్తాయి
హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. ఇప్పుడురూ.25 కోట్లు రెమ్యునరేషన్
హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. ఇప్పుడురూ.25 కోట్లు రెమ్యునరేషన్
పీఎఫ్ రూల్స్‌లో భారీ మార్పులు.. కేంద్రం కొత్త పథకాలు
పీఎఫ్ రూల్స్‌లో భారీ మార్పులు.. కేంద్రం కొత్త పథకాలు
మహిళలకు అండగా తెలంగాణ సర్కార్.. ఆ విషయంలో వారికే టాప్ ప్రయారిటీ!
మహిళలకు అండగా తెలంగాణ సర్కార్.. ఆ విషయంలో వారికే టాప్ ప్రయారిటీ!
మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!!
మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!!
పుచ్చకాయ గింజలు తింటున్నారా..? వాయమ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
పుచ్చకాయ గింజలు తింటున్నారా..? వాయమ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
ఆ ఒక్క సెలబ్రేషన్ సంజు శాంసన్ నిషేధానికి దారితీస్తుందా?
ఆ ఒక్క సెలబ్రేషన్ సంజు శాంసన్ నిషేధానికి దారితీస్తుందా?