Maha Shivaratri: మహా శివరాత్రి రోజున ఉపవాస సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదంటే..

మహా శివరాత్రి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో పాటిస్తారు. శివరాత్రి రోజున చేసే  ఉపవాసం,  రాత్రి జాగరణను అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తే.. శివుడు భక్తులకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్మకం.

Maha Shivaratri: మహా శివరాత్రి రోజున ఉపవాస సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదంటే..
Maha Shivaratri Fasting
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2023 | 11:01 AM

మహా శివరాత్రి పర్వదినాన్ని ఫిబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకుంటారు. హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈరోజు శివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. శివరాత్రి రోజున జాగారానికి, ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉంది. మహా శివరాత్రి పండుగ రోజున చాలా మంది ‘నిర్జల వ్రతాన్ని’ ఆచరిస్తారు. అంటే కొందరు భక్తులు నీరు మాత్రమే తాగుతారు. మరికొందరు పండ్లు, పాలు, తృణధాన్యాలు  తిని ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి ఉపవాసం.. శివ రాత్రి రోజు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది. ఉపవాస నియమాలు అన్ని శివరాత్రిలకు ఒకే విధంగా ఉంటాయి..

సాధారణంగా ప్రజలు ఉపవాస సమయంలో పండ్లు తింటారు. నీరు లేదా పాలు తాగుతారు. కొందరు ఆహారం లేదా పానీయాలకు దూరంగా ఉంటారు. నీళ్లు కూడా తాగకుండా పస్తులుంటారు. మహా శివరాత్రి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో పాటిస్తారు. శివరాత్రి రోజున చేసే  ఉపవాసం,  రాత్రి జాగరణను అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తే.. శివుడు భక్తులకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్మకం. పాలు, ఆకులు, పండ్లు సమర్పించడానికి సమీపంలోని శివాలయాన్ని సందర్శించి శివరాత్రిని ప్రారంభమవుతుంది. మరికొందరు స్వీట్లు, పెరుగు, తేనెను కూడా సమర్పిస్తారు. ప్రజలు పగలు, రాత్రి ఉపవాసం ఉంటారు. రాత్రి సమయంలో భక్తులు శివుని స్తోత్రాలు ఆలపించి పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి అభిషేకం చేస్తారు. మర్నాడు ప్రజలు పూజ చేసిన తర్వాత భోజనం చేసి ఉపవాసం విడిచి పెడతారు.

మహా శివరాత్రి ఉపవాసంలో చేయవలసినవి..  చేయకూడనివి మీకోసం 

ఇవి కూడా చదవండి
  1. పప్పులు, ఉప్పు, గోధుమ , బియ్యం వంటి తృణధాన్యాలకు దూరంగా ఉండాలి.
  2. ఉడికించిన చిలగడ దుంపలు, పండ్లు వంటి ఆహారా పదార్ధాలను తినవచ్చు.
  3. చిలగడ దుంపలను ..  పసుపు, వెల్లుల్లి లేదా ఉల్లిపాయలను వేసి ఉడికించవద్దు.
  4. ఒకవేళ శివ రాత్రి సమయంలో తినే ఆహారంలో ఉప్పు ఉపయోగించాల్సి వస్తే.. రాతి ఉప్పుని ఉపయోగించండి.
  5. ఈ రోజున ఉపవాసం రోజున పండ్లు, పాలు, నీరు తీసుకోవచ్చు.
  6. మహా శివరాత్రి నాడు భక్తులు ప్రత్యేక ఆహారాన్ని ఫలహారంగా తీసుకోవచ్చు.
  7. సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం జావా వంటి ఫుడ్ ఐటమ్స్ అల్పాహారంగా చేసుకోవచ్చు.
  8. మిరియాలు, యాలకులు, బాదం, గసగసాలు, సోపు గింజలు కలిపి తయారు చేసిన తండై పొడిని జోడించడం ద్వారా మీరు రుచికరమైన తాండాయి పానీయాన్ని తయారు చేసుకోండి. ఈ పానీయం మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా శరీరానికి శీతలకరణిగా కూడా పనిచేస్తుంది.
  9. మీరు ఉడికించిన చిలగడదుంప, మసాలాలు లేకుండా ఆలూ టిక్కీ, పనీర్ కూడా తీసుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)