AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapna Shastra: ఇటువంటివి కలలో కనిపిస్తే.. ఆకస్మికంగా ధన లాభం.. సుఖ సంతోషాలు మీ సొంతం..

స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలు రాబోయే కాలంలో ఆ వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలను సూచిస్తాయి. కొన్ని కలలు చాలా శుభమైనవిగా పరిగణించబడతాయి. ఈ రోజు శుభానికి సంకేతంగా నిలిచే కొన్ని రకాల కల గురించి తెలుసుకుందాం. 

Swapna Shastra: ఇటువంటివి కలలో కనిపిస్తే.. ఆకస్మికంగా ధన లాభం.. సుఖ సంతోషాలు మీ సొంతం..
Swapna Sastram
Surya Kala
|

Updated on: Feb 17, 2023 | 10:19 AM

Share

ప్రతి వ్యక్తి నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సర్వసాధారణం. ఆ కలలో జంతువులు, మొక్కలు, రకరకాల విషయాలు, సంఘటనలు కనిపిస్తుంటాయి. ఈ కలలు శుభకరమైనవి , అశుభకరమైనవి ఉంటాయి. అయితే జ్యోతిషశాస్త్రం ఆ కలలకు.. వివిధ అర్థాలను వివరించింది. స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలు రాబోయే కాలంలో ఆ వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలను సూచిస్తాయి. కొన్ని కలలు చాలా శుభమైనవిగా పరిగణించబడతాయి. ఈ రోజు శుభానికి సంకేతంగా నిలిచే కొన్ని రకాల కల గురించి తెలుసుకుందాం.  ఒక వ్యక్తి సంపదతో పాటు అనేక రకాల సుఖాలను పొందుతాడు. స్వప్న శాస్త్రం ప్రకారం ఏ కలలను శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం.

వర్షం పడుతున్నట్లు కలలు వస్తే.. ఎప్పుడైనా ఒక వ్యక్తి తన కలలో వర్షం పడుతున్నట్లు చూస్తే స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో వర్షం కనిపించడం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. వర్షం పడుతున్నట్లు కలలో కనిపిస్తే.. ఎప్పటి నుంచో వసూలు కానీ డబ్బులు, పాత పెట్టుబడి లేదా పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది.  మీ మనసులో ఉన్న అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయి. అంతేకాదు కలలో వర్షం కనిపించడం ప్రేమ సంబంధంలో బలానికి సంకేతం.

కలలో గుర్రపు స్వారీ.. స్వప్నంలో గుర్రపు స్వారీ చేస్తూ ఎక్కడికో దూరం ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం, మీకు త్వరలో సంపద, గౌరవం లభిస్తుందని అర్థం. ఉద్యోగంలో మంచి ఆఫర్లు రావచ్చు. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కలలో మీ ముఖాన్ని మీరే చూసుకోవడం..  మీరు కలలో అద్దంలో మీ స్వంత ముఖాన్ని చేసుకున్నట్లు కనిపిస్తే.. అది కూడా శుభసూచకమే. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఆఫీసులో పురోగతి, లాభానికి గరిష్ట అవకాశం ఉంది. పెళ్లికాని యువకుడు లేదా అమ్మాయి తన కలలో తనను తాను అద్దంలో చూసుకుంటే.. త్వరలో వీరి జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అర్ధం

కలలో జుట్టు లేదా గోర్లు చూడటం మీ కలలో మీ జుట్టు లేదా గోర్లు కత్తిరించుకున్నట్లు కనిపిస్తే.. అకస్మాత్తుగా డబ్బును పొందనున్నారని అర్ధం. అంతేకాదు.. మీ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీరు అప్పుల నుండి విముక్తి పొందవచ్చు.

కలలో పాన్ తిన్నట్లు.. ఎవరైనా పాన్ తింటున్నట్లు కలకంటే.. వీరు శుభవార్త వింటారని స్వప్న శాస్త్రంలో పేర్కొంది.  మీకు డబ్బు , అదృష్టం.. అన్నింటా మంచి మద్దతు లభిస్తుందని సంకేతం. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక వీలైనంత త్వరగా నెరవేరే సూచనలు ఉన్నాయని అర్ధం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)