Chicken: చికెన్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా.. లేదా.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు..
చికెన్ తింటే మంచిదా..? కాదా.? ఈ విషయం పక్కన పెడితే.. అసలు వండిన చికెన్‌లో ఎంత కొలస్ట్రాల్ పెరుగుతుంది.. గుండె జబ్బులు ఉన్నవారు తింటే మంచిదా? కాదో ఇక్కడ తెలుసకుందాం..
భారతదేశంలో మాంసాహారు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అదే స్థాయిలో శాకాహం తినేవారు కూడా పెరుగుతున్నారు. అయితే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 అందించిన లెక్కల ప్రకారం, భారతదేశంలో 78 శాతం మంది మహిళలు, 70 శాతం మంది పురుషులు మాంసాహారం తింటున్నారని తేలింది. అయితే ఇందులో రెడ్ మీట్ సంఖ్య పెద్దగా లేకున్నా.. చికెన్ తింటున్నవారు మాత్రం పెరిగిపోయారు. రెడ్ మీట్ కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. దాని ధర కూడా ఎక్కువ కాదు.. చాలా తక్కువగ ఉండటమే.. చికెన్ తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది అతిపెద్ద ప్రశ్న.. అసలు నిజం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నాన్-వెజ్ తినడం ద్వారా కొలెస్ట్రాల్ రేటు పెరుగుతుందా..?
రెడ్ మీట్‌లో ఉండే బ్యాడ్ ఫ్యాట్ కారణంగా.. కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి చాలా మంది డైటీషియన్లు కూడా నాన్-వెజ్ ఐటమ్స్ కంటే చికెన్‌నే ఎక్కువ ఆరోగ్యకరమైనదిగా సూచిస్తారు. చికెన్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయడంలో సందేహం లేదు. కానీ ఏదైనా ఎక్కువగా తినడం హానికరం, చికెన్ విషయంలో కూడా అదే జరుగుతుంది.
చికెన్ తినడం ప్రయోజనకరమా లేదా హానికరమా..?
చికెన్ మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందా..? లేదా హానికరమా అనేది నాన్-వెజ్ ఐటెమ్‌ను ఎలా వండుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సంతృప్త కొవ్వు ఉన్న చికెన్ వంటలో మీరు ఎక్కువ నూనెను ఉపయోగించినట్లయితే, అది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
చికెన్‌లో లభించే పోషకాలు
స్కిన్ లెస్.. వండిన చికెన్ బ్రెస్ట్ (172 గ్రాములు)లో 54 గ్రాముల ప్రోటీన్లు ఉంటయి.
- కొలెస్ట్రాల్ – 87 మిల్లీగ్రాములు –
- కొవ్వు – 13.5 గ్రాములు
- కేలరీలు – 237 మిల్లీగ్రాములు
- కాల్షియం – 15 మిల్లీగ్రాములు
- సోడియం 404 మిల్లీగ్రాములు
- విటమిన్ ఎ – 160 మైక్రోగ్రాములు
- ఐరన్ – 1.25 మిల్లీగ్రాములు
- 1.25 మిల్లీగ్రాములు
ఈ చికెన్ వంటకాలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మీరు చికెన్ తయారీలో ఎక్కువ వెన్న, నూనె లేదా ఏదైనా ఇతర సంతృప్త కొవ్వును ఉపయోగిస్తే.. అప్పుడు స్పష్టంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బటర్ చికెన్, చికెన్ చాంగ్జీ, కడాయి చికెన్, ఆఫ్ఘని చికెన్ తింటే మరింత లావు పెరుగుతారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం