- Telugu News India News Kisan Credit Card Farmers can get up to Rs 3 lakh loan with Low Interest Rate 2022 2023 Know All Details
Farmers: రైతులకు అద్దిరిపోయే న్యూస్.. 4 శాతం వడ్డీకే రుణాలు పొందొచ్చు.. వివరాలివే..
రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా రూ. 6,000 సాయం అందిస్తుంది. అదే సమయంలో పంట పెట్టుబడికి మరింత సాయం అందించేందుకు తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణాలను కూడా అందిస్తోంది కేంద్రం.
Updated on: Feb 16, 2023 | 9:47 PM

రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా రూ. 6,000 సాయం అందిస్తుంది. అదే సమయంలో పంట పెట్టుబడికి మరింత సాయం అందించేందుకు తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణాలను కూడా అందిస్తోంది కేంద్రం.

కిసాన్ క్రెడిట్ పేరుతో రైతులకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. స్వల్పకాలిక రుణాలను రైతులకు అందించడం కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1980లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది.

ఈ పథకం కింద రైతులు కేవలం 4 శాతం వార్షిక వడ్డీకే వ్యవసాయ రుణాలను పొందవచ్చు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల నిర్వహణ కోసం ఈ రుణాలను రైతులకు ఇస్తారు.

రైతులు రూ. 3 లక్షల వరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ రుణాల ద్వారా రైతులు పాడి పశువులు, పంపుసెట్లు, ఇతర వ్యవసాయ అవసరాలను తీర్చుకోవచ్చు.

అర్హులైన రైతులకు కిసాన్ క్రిడిట్ కార్డ్ మంజూరు చేస్తారు. దీని ద్వారానే రైతులు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు.. స్మార్ట్ కార్డ్, డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. ఇక రుణం తీసుకున్న రైతు మరణించినా, శాశ్వత వైకల్యానికి గురైనా రూ. 50 వేలకు బీమా కవరేజీ లభిస్తుంది.

ఈ స్కీమ్ కింద రైతులు రూ. 1.60 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణాలు తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే, పూచీకత్తు తప్పనిసరి. ఇక తీసుకున్న రుణాలను పంట కాలం ముగిసిన తరువాత గానీ, 3 సంవత్సరాల లోపు గానీ చెల్లించవచ్చు.

కిసాన్ కార్డుపై వాస్తవానికి 7 శాతం వార్షిక వడ్డీ ఉంటుంది. అయితే, సకాలంలో రుణాలు చెల్లిస్తే.. 3 శాతం వరకు వడ్డీ మినహాయింపు ఉంటుంది. అంటే రైతులు కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నమాట.





























