Paytm New Feature: పేటీఎంలో సరికొత్త ఫీచర్.. ఇక నుంచి జెట్ స్పీడ్‌లో ట్రాన్సాక్షన్స్..

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) UPI LITEని బుధవారం ప్రారంభించింది. తక్కువ విలువ కలిగిన UPI లావాదేవీల కోసం ఈ ఫీచర్‌ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది.

Paytm New Feature: పేటీఎంలో సరికొత్త ఫీచర్.. ఇక నుంచి జెట్ స్పీడ్‌లో ట్రాన్సాక్షన్స్..
Paytm New Feature
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 15, 2023 | 11:04 PM

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) UPI LITEని బుధవారం ప్రారంభించింది. తక్కువ విలువ కలిగిన UPI లావాదేవీల కోసం ఈ ఫీచర్‌ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఈ ఫీచర్ సహాయంతో ఒకే క్లిక్‌లో రియల్ టైమ్ లావాదేవీలు మరింత వేగంగా చేయవచ్చు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ట్రెండ్‌ను ప్రోత్సహించడం బ్యాంక్ లక్ష్యం.

NPCI ఫీచర్..

UPI లైట్‌ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించింది. ఈ యాప్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సెప్టెంబర్ 2022లో ప్రారంభించింది. ఇది తక్కువ మొత్తంలోని లావాదేవీలను స్పీడప్ చేస్తుంది. ఈ చెల్లింపులు Paytm బ్యాలెన్స్, హిస్టరీ విభాగంలో మాత్రమే కనిపిస్తాయి. బ్యాంకు పాస్‌బుక్‌లో ఇవి ఉండవు.

ఇలాంటి UPI లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి పేమెంట్స్ బ్యాంక్ పేటీఎం. UPI లైట్ వాలెట్ వినియోగదారులు రూ. 200 వరకు తక్షణ లావాదేవీలను చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవాంతరాలు లేకుండా ఈజీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. UPI లైట్ లో రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2000 వరకు యాడ్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. అలాగే రోజుకు రూ. 4 వేల వరకు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

సురక్షితం, వేగవంతం..

NPCI COO ప్రవీణా రాయ్ మాట్లాడుతూ.. Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో UPI లైట్‌ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. UPI లైట్‌లో, వినియోగదారులు వేగవంతమైన, సురక్షితమైన, అవాంతరాలే లేని తక్కువ-విలువ లావాదేవీలను పూర్తి చేసే వీలుంటుంది. యూపీఐ ద్వారా 50 శాతం కంటే ఎక్కువ లావాదేవీలు రూ.200 కంటే తక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..