AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: ఇలా కూడా ఉంటారా! ఒకడేమో చెవి కొరికాడు.. మరొకడు బర్త్ డే పార్టీకి పిలిచి చితక్కొట్టాడు..!

గొడవ పడితే తిట్టుకుంటారు. ఇంకా పెద్దదయితే కొట్టుకుంటారు. కానీ వాడు మాత్రం కోపం వచ్చి చెవి కొరికేశాడు. చెవి ఊడి కిందపడేలా కొరికి పారేశాడు. ఇప్పుడు బాధితుడు లబోదిబోమంటూ ఆస్పత్రుల..

Shocking: ఇలా కూడా ఉంటారా! ఒకడేమో చెవి కొరికాడు.. మరొకడు బర్త్ డే పార్టీకి పిలిచి చితక్కొట్టాడు..!
Representative Images
Shiva Prajapati
|

Updated on: Feb 14, 2023 | 10:39 PM

Share

గొడవ పడితే తిట్టుకుంటారు. ఇంకా పెద్దదయితే కొట్టుకుంటారు. కానీ వాడు మాత్రం కోపం వచ్చి చెవి కొరికేశాడు. చెవి ఊడి కిందపడేలా కొరికి పారేశాడు. ఇప్పుడు బాధితుడు లబోదిబోమంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకో ప్రబుద్ధుడు కొడుకు బర్త్‌డేకి బంధువులను పిలిచాడు. పిలిచాడు కదా అని అందరు ఎగురుకుంటూ వెళ్లారు. అర్ధరాత్రి తలుపులు వేసి ఆడా మగా తేడా లేకుండా అందరిని చితక్కొట్టాడు ఆ మహానుభావుడు. ఎవ్వరూ పారిపోకుండా తాళం వేసి మరీ బాది పారేశాడు. ఎందుకు కొట్టావురా నాయనా అంటే తిడితే కొట్టరా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. బాధితులు మాత్రం వీళ్లెవరండి బాబూ అంటూ వాపోతున్నారు.

వేరు వేరు చోట్ల చోటు చేసుకున్న ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో మురళిపై దాడి చేశాడు పెద్ద బాల గురవయ్య. ఈ గొడవలో మురళి చెవి కొరికేశాడు. దెబ్బకు ఆ చెవి ఊడిపోయింది. దాంతో ఊడిపోయిన చెవి పట్టుకుని ఆస్పత్రికి పరుగులు తీశాడు మురళి. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు.

వికారాబాద్‌లో సైకో వీరంగం..

తెలంగాణలోని వికారాబాద్‌లో సైకో వీరంగం సృష్టించాడు. నవీన్ తన కొడుకు బర్త్‌డే పార్టీకి బంధువులను పిలిచి.. అందరినీ చితక్కొట్టాడు. అర్థరాత్రి తలుపులకు తాళం వేసి అందరినీ చితకబాదాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి సైకో బారి నుంచి బాధితులను కాపాడారు. ఎందుకిలా చేశాడని విచారించగా.. అందరూ తనను తిట్టారని, ఆ కారణంగా కొట్టినట్లు చెప్పుకొచ్చాడు నవీన్ కుమార్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్