AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Murasu: మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Cyclone Murasu Alert: అర్నబ్‌ తుఫాన్‌ సృష్టించిన అల్లకల్లోలం నుంచి ఇంకా కోలుకోని ఏపీని.. మరో తుఫాన్‌ గండం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో.. రానున్న కొన్ని గంటల్లో అది తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుఫాన్‌కు 'మురసు'గా నామకరణం చేసింది వాతావరణశాఖ.

Cyclone Murasu: మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
Cyclone Murasu Alert
Anand T
|

Updated on: Nov 01, 2026 | 6:56 AM

Share

అర్నబ్‌ తుఫాన్‌ సృష్టించిన అల్లకల్లోలం నుంచి ఏపీ ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్‌ భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి మరికొన్ని గంటల్లో తీవ్ర రూపం దాల్చబోతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుఫాన్‌కు మురసు అని నామకరణం చేసింది. ఈ మురసు తుఫాన్‌ ఏపీ వైపుగా దూసుకొస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నవంబర్ 2, 3 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అధికారులు. ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందో మ్యాప్‌లో వివరించారు.

సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను తీర ప్రాంత ప్రజలు పాటించాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ ముంపు ప్రాంతాల ప్రజలను అలర్ట్‌ చేశారు. అటు.. మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.

ఇదిలా ఉండగా మరో తుఫాన్‌ ముప్పుపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తుఫాన్‌ ముందస్తు చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 2, 3, 4 తేదీల్లో ఏపీకి భారీ వర్ష సూచనతో ప్రతి ఆరు గంటలకు వాయుగుండం కదలికలను అంచనా వేయాలన్నారు. ఉపగ్రహచిత్రాలు, డాప్లర్ రాడార్లతో నిరంతరం తుఫాన్‌ పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. అర్నబ్‌ తరహాలోనే మురసును ఎదుర్కొని ప్రజలకు భరోసానివ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.

మరోవైపు.. తుఫాన్‌ హెచ్చరికలపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన జారీ చేశారు. రేపు ఏపీ తీరానికి తుఫాన్‌ సమీపించే అవకాశం ఉండటంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, NTR, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు అప్రమత్తంగాఉండాలన్నారు.

పంటల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలు సిద్ధం చేయాలని.. కోత పూర్తయిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండటంతో పాటు.. రైతులకు అన్ని విధాలా భరోసా ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా.. అర్నబ్ తుఫాన్‌ బీభత్సం నుంచి తేరుకోకముందే మురసు ముప్పు ముంచుకొస్తుండటం ఏపీని భయపెడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
కాసేపట్లో ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌
కాసేపట్లో ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి
ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి
నవంబర్ 1 రాశిఫలాలు: అదృష్టం కలిసొచ్చే రాశులివే..! వారు జాగ్రత్త
నవంబర్ 1 రాశిఫలాలు: అదృష్టం కలిసొచ్చే రాశులివే..! వారు జాగ్రత్త
410 కోట్ల ఏళ్ల నాటి అంగారకుడి రాయి.. ఎక్కడ పడిందంటే..
410 కోట్ల ఏళ్ల నాటి అంగారకుడి రాయి.. ఎక్కడ పడిందంటే..
రవి పుష్య యోగం: ఆదివారం నాడు అఖండ ఐశ్వర్యం కొరకు చేయాల్సిన..
రవి పుష్య యోగం: ఆదివారం నాడు అఖండ ఐశ్వర్యం కొరకు చేయాల్సిన..