Credit Cards: క్రెడిట్‌ కార్డుదారులు ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే తీవ్రంగా నష్టపోతారు జాగ్రత్త

దేశంలో చాలా మందికి క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి బ్యాంకులు. కస్టమర్లకు సులభంగా క్రెడిట్‌ కార్డులు జారీ చేసేస్తున్నాయి. అయితే కార్డు వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్‌ కార్డు వాడకం..

Credit Cards: క్రెడిట్‌ కార్డుదారులు ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే తీవ్రంగా నష్టపోతారు జాగ్రత్త
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Feb 16, 2023 | 5:00 AM

దేశంలో చాలా మందికి క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి బ్యాంకులు. కస్టమర్లకు సులభంగా క్రెడిట్‌ కార్డులు జారీ చేసేస్తున్నాయి. అయితే కార్డు వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్‌ కార్డు వాడకం విధానం తెలిసి ఉండాలి. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా వాడితే ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. గడువులోగా కార్డు బిల్లు చెల్లిస్తే మేలు.. లేకపోతే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఎందుకంటే వడ్డీ, ఇతర ఛార్జీలు అంటూ భారీగా వడ్డించనున్నాయి బ్యాంకులు. అందుకే క్రెడిట్‌ కార్డులు వాడే వారు జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక గడువులోగా బిల్లు చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తులో రుణాలు తీసుకునే సమయంలో ఆ ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

క్రెడిట్ స్కోర్‌ తగ్గిపోతే ఏ బ్యాంకు నుంచి కూడా రుణం అందే అవకాశం ఉండదు. దీంతో సమయానికి బిల్లు చెల్లిస్తూ సరిగ్గా వాడుకుంటే రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తున్నవారి క్రెడిట్‌ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోర్‌ అనేది రుణగ్రహిత క్రెడిట్‌ విలువను సూచిస్తుంది. రుణాలుతీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్‌ బ్యూరోలు క్రెడిట్‌ స్కోర్‌ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో త‌క్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సిబిల్‌ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు..

మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాల‌ గురించి జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. రుణం లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మీ స్కోర్‌ను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపై అంద‌రికీ అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంటుంది. అవి ఏంటంటే.. వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వడం, మీ రుణాన్ని పునర్నిర్మించడం వంటివి.

ఇవి కూడా చదవండి

మినిమమ్‌ బిల్లు చెల్లిస్తే ఏమవుతుంది?

కార్డు బిల్లు వచ్చిన తర్వాత పూర్తిగా చెల్లిస్తే మంచిది. లేకపోతే మినిమమ్‌ బిల్లు చెల్లించాలని సూచిస్తుంటాయి బ్యాంకులు. అలా పూర్తి బిల్లు చెల్లించకుండా కేవలం మినిమమ్‌ బిల్లు చెల్లిస్తే కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. దీని వల్ల మీకు వడ్డీ, జీఎస్టీ, ఇతర ఛార్జీలు విధిస్తుంటాయి బ్యాంకులు. ఇలా మినిమమ్‌ బిల్లు జోలికి వెళ్లకుండా పూర్తి బిల్లు చెల్లిస్తేనే మంచిది. అలాగే అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు హామీదారుగా ఉండ‌టం సర్వ సాధారణం. అయితే ఇలా తరచుగా చేయ‌డం వ‌ల‌న త‌మ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుంద‌నే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఒక వేళ కొందరికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారికి భవిష్యత్తులో రుణాల విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చేస్తే కొత్త రుణాల కోసం మీ సొంత‌ అర్హత తగ్గడమే కాదు, అసలు రుణగ్రహీతకు బ‌కాయిలు ఉన్నట్లయితే మీరు కూడా నష్టపోవచ్చు. ఎంత మొత్తం ఖర్చు చేసినా.. సమయానికి బిల్లు చెల్లిస్తే బెటర్‌.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే