Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Profile Picture: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఫోటో అప్‌డేట్‌ చేయాలా..? ఇంట్లోనే ఉండి ఇలా చేసుకోండి

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్‌ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటం వల్ల వివిధ..

EPFO Profile Picture: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఫోటో అప్‌డేట్‌ చేయాలా..? ఇంట్లోనే ఉండి ఇలా చేసుకోండి
గృహ పునరుద్ధరణ కోసం: కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలలో వడ్డీ, 12 నెలల బేసిక్ పే + డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు ఉద్యోగి వాటాలో తక్కువ మొత్తంలో గృహ పునరుద్ధరణల కోసం ఉపసంహరణలను అనుమతించే నిబంధన ఉంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ PF ఖాతాదారు, అతని లేదా ఆమె జీవిత భాగస్వామి లేదా వారిద్దరూ కలిగి ఉండవచ్చు. ఒక వ్యక్తి రెసిడెన్షియల్ ప్రాపర్టీని పూర్తి చేసిన 5 సంవత్సరాల తర్వాత ఒకసారి 2 సార్లు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. 10 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా PF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. 54 ఏళ్లు దాటిన లేదా పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు, ఖాతాదారులు సవరించిన EPF ఉపసంహరణ ప్రమాణాల ప్రకారం 90% వరకు సేకరించిన నిధులను విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అనుమతిస్తారు.
Follow us
Subhash Goud

|

Updated on: Feb 14, 2023 | 8:03 AM

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్‌ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటం వల్ల వివిధ పనుల నిమిత్తం పీఎఫ్‌ (పీఎఫ్‌) కార్యాలయానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. అయితే పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునేవారు ఈ-నామినేషన్‌ నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ-నామినేషన్‌ పూర్తి చేయకపోతే డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు. అందుకు పీఎఫ్‌ ఖాతాదారులు ఈ-నామినేషన్‌ పనిని పూర్తి చేసుకోవడం మంచిదని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఈ నామినేషన్‌ ఫైలింగ్‌ చేస్తున్నా.. అది పూర్తి కావడం లేదంటే అందుకు కారణాలను గమనించాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ అప్‌డేట్‌ చేయకపోతే ఈ-నామినేషన్‌ పూర్తి చేయలేమనే విషయాన్ని గుర్తించుకోవాలి.

ప్రొఫైల్‌ ఫోటో అప్‌లోడ్‌ చేయడం ఎలా..

  • మీరు ఉందుగా యూఏఎన్‌ (UAN) నెంబర్‌ ఐడీతో ఈపీఎఫ్‌లో పోర్టల్‌ఓల లాగిన్‌ కావాలి.
  • ఆ తర్వాత మెనూ సెక్షన్‌లో క్లిక్‌ చేస్తే అక్కడ ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీకు ఎడమ వైపులో ప్రొఫైల్‌ ఫోటో ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేసి ఫోటోను మార్చడం, లేదా అప్‌లోడ్‌ చేయడం చేయాలి.
  • ప్రొఫైల్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఈపీఎఫ్‌ఓలో మీ ఫోటో అప్‌లోడ్‌ చేయాలి.
  • మన రెండు చెవులు కనిపించేలా ఫోటో విజువల్‌ ఉండేలా చూసుకోవాలి. ఫోటో JPEG, JPG, PNG ఫార్మాట్‌లో సేవ్‌ చేయాలి.
  • ఆ తర్వాత అప్‌లోడ్‌ యువర్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఓకే అనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి. దీంతో మీ ఫోటో అప్‌లోడ్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి