AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా..? ముందుగా ఈ విషయాలను తెలుసుకోవడం ముఖ్యం

ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ఎంతో దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే రకరకాల వైరస్‌లు చుట్టుముడుతున్నారు. కరోనా కాలంలో ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది..

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా..? ముందుగా ఈ విషయాలను తెలుసుకోవడం ముఖ్యం
Health Insurance
Subhash Goud
|

Updated on: Feb 15, 2023 | 5:30 AM

Share

ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ఎంతో దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే రకరకాల వైరస్‌లు చుట్టుముడుతున్నారు. కరోనా కాలంలో ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. దీనివల్ల ఆసుపత్రుల చుట్టు తిరగాల్సి ఉంటుంది. వైద్యానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. వైద్య ఖర్చులను నివారించడానికి ప్రజలు ఆరోగ్య బీమాపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్య ప్రణాళిక సహాయంతో, ఆసుపత్రికి సంబంధించిన అనేక పెద్ద ఖర్చులను అధిగమించవచ్చు. చాలా కంపెనీలు మార్కెట్‌లో హెల్త్ ప్లాన్‌లను అందిస్తున్నప్పటికీ, వాటిలో ఏది మంచిదో తెలుసుకోవడంలో చాలా మంది తికమక పడుతుంటారు. 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం నిపుణుల వివరాల ప్రకారం టాప్ ఆరోగ్య బీమా పథకాల గురించి అందిస్తున్నాము.

పాలసీలు తీసుకునే ముందు వీటిని తెలుసుకోండి:

  • వయస్సు ప్రమాణాలు
  • ప్రీమియం కవరేజ్
  • వెయిటింగ్ పీరియడ్
  • క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు
  • ముందు ఆసుపత్రిలో చేరిన తర్వాత కవరేజ్
  • ప్రసూతి కవరేజ్
  • నో-క్లెయిమ్-బోనస్/నో-క్లెయిమ్-డిస్కౌంట్

టాప్ ఆరోగ్య బీమా పథకాలు

  • ఎల్‌ఐసీ బీమా పాలసీ
  • నివా బుపా- ఆరోగ్య భరోసా
  • లైఫ్‌లైన్ (సుప్రీమ్ ప్లాన్)
  • మాగ్మా హెచ్‌డిఐ- వన్ హెల్త్ (ప్రీమియం ప్లాన్)
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో- ఆప్టిమా రిస్టోర్
  • ఆదిత్య బిర్లా హెల్త్- యాక్టివ్ హెల్త్ ప్లాంటినమ్ (ప్రీమియర్ ప్లాన్)
  • ఎడెల్వీస్ జనరల్- ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ (గోల్డ్ ప్లాన్)
  • కేర్ ఇన్సూరెన్స్- కేర్
  • ICICI లాంబార్డ్- కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ (హెల్త్ ఎలైట్ ప్లాన్)
  • HDFC ఎర్గో- ఆప్టిమా సెక్యూర్
  • గో డిజిట్- హెల్త్ ఇన్సూరెన్స్ (కంఫర్ట్ ప్రో ప్లాన్)
  • మణిపాల్ సిగ్నా- ప్రోహెల్త్ (ప్లస్ ప్లాన్)
  • చోళ ఎంఎస్- ఫ్లెక్సీ హెల్త్
  • ఆదిత్య బిర్లా ఆరోగ్యం- యాక్టివ్ అష్యూర్
  • స్టార్ హెల్త్- సమగ్ర

ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే ముందు పాలసీకి సంబంధించిన వివరాలన్ని పూర్తిగా తెలుసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగాననే ఇన్సురెన్స్‌ ఏజంటును గానీ, సంబంధిత అధికారులను అడగండి. ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటే ఈ పాలసీని కొనుగోలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అభిషేక్ శర్మ విధ్వంసం.. గంభీర్-సూర్య వేసిన మాస్టర్ ప్లాన్ అదుర్స్
అభిషేక్ శర్మ విధ్వంసం.. గంభీర్-సూర్య వేసిన మాస్టర్ ప్లాన్ అదుర్స్
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు
ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇదేదో సినిమా షూట్ అనుకునెరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేదో సినిమా షూట్ అనుకునెరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
విజయ్ పెళ్లి అయిపోయింది.. లేడీ ఫ్యాన్ ఎమోషనల్.
విజయ్ పెళ్లి అయిపోయింది.. లేడీ ఫ్యాన్ ఎమోషనల్.
నెల రోజులు షుగర్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా
నెల రోజులు షుగర్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా
The Kerala Story -2: కేరళ స్టోరీ -2 పై స్టే ఎత్తివేత.. విడుదలకు సర్వం సిద్ధం..
The Kerala Story -2: కేరళ స్టోరీ -2 పై స్టే ఎత్తివేత.. విడుదలకు సర్వం సిద్ధం..
తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్.. ఇదిగో వీడియో
తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్.. ఇదిగో వీడియో
కాజల్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదమా? తల్లిదండ్రులకు హెచ్చరిక!
కాజల్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదమా? తల్లిదండ్రులకు హెచ్చరిక!
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర