Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF Scheme: పీపీఎఫ్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన కీలక అప్డేట్ ఇది.. అలా జరిగి ఉంటే..

దేశంలో అనేక పెట్టుబడి పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాలు వివిధ తరగతుల ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నాయి. అదే సమయంలో పెట్టుబడి, పొదుపునకు సంబంధించిన పథకాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తోంది.

PPF Scheme: పీపీఎఫ్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన కీలక అప్డేట్ ఇది.. అలా జరిగి ఉంటే..
Ppf
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 14, 2023 | 5:33 PM

దేశంలో అనేక పెట్టుబడి పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాలు వివిధ తరగతుల ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నాయి. అదే సమయంలో పెట్టుబడి, పొదుపునకు సంబంధించిన పథకాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఉంది. భారత పౌరులు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, PPFకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ గురించి కూడా పెట్టుబడి దారులకు తెలియాల్సి ఉంది.

PPF పథకం గురించి..

PPF ద్వారా పెట్టుబడి పెట్టిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం అందుతుంది. అదే సమయంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పథకం ప్రయోజనాలు మరింత పెరిగేవి.. వాస్తవానికి ఫిబ్రవరి 1, 2023న, మోడీ ప్రభుత్వం.. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ను సమర్పించింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు కూడా చేశారు. ఈ బడ్జెట్‌కు ముందు ప్రజలు పీపీఎఫ్‌పై ప్రభుత్వం నుంచి భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ద్వారా పీపీఎఫ్‌లో సానుకూల మార్పులు వస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

బడ్జెట్ ముందు అంచనాలు..

బడ్జెట్‌కు ముందు ఒక ఆర్థిక సంవత్సరంలో PPFలో గరిష్ట పెట్టుబడి పరిమితిని రూ.1.5 లక్షల నుంచి పెంచాలని, మెచ్యూరిటీ మొత్తానికి ప్రస్తుతం ఉన్న 15 సంవత్సరాలను కూడా తగ్గించాలని ప్రజలు ఆశించారు. అయితే ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పీపీఎఫ్ పథకంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు, ప్రభుత్వం ఈ రెండు పనులను చేసి ఉంటే అది PPF పథకం యొక్క పెట్టుబడిదారులకు చాలా ప్రయోజనం చేకూర్చేది. వారి పెట్టుబడితో పాటు పొందిన మెచ్యూరిటీ మొత్తాన్ని పెంచేది. కానీ అలా జరగకుండా పోయింది. ఈ క్రమంలో కేంద్రం మరోసారి పీపీఎఫ్ గురించి పునరాలోచిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..