Men Health: ఆ విషయంలో వీక్‌గా ఉన్నారా? ఈ సమయంలో ఇది తింటే మగమహారాజులకు జాతరే..!

రోజుకొక వైరస్.. రోజుకొక వ్యాధి.. వెరసి జనాల జీవితం అస్తవ్యస్థంగా మారింది. అయితే, ఈ వైరస్‌లను ఎదుర్కోవాలన్నా.. రోగాల బారిన పడకుండా ఉండాలన్నా.. శరీరంలో రోగనిరోధక ఉండాలి.

Men Health: ఆ విషయంలో వీక్‌గా ఉన్నారా? ఈ సమయంలో ఇది తింటే మగమహారాజులకు జాతరే..!
Men Health
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 14, 2023 | 10:05 PM

రోజుకొక వైరస్.. రోజుకొక వ్యాధి.. వెరసి జనాల జీవితం అస్తవ్యస్థంగా మారింది. అయితే, ఈ వైరస్‌లను ఎదుర్కోవాలన్నా.. రోగాల బారిన పడకుండా ఉండాలన్నా.. శరీరంలో రోగనిరోధక ఉండాలి. మరి ఈ రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి? అంటే మనం తినే ఆహారమే మార్గం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తినే ఆహారంతో పాటు.. వంటలో వినియోగించే కొన్ని పదార్థాలు కూడా అత్యంత శక్తివంతమైనవి ఉంటాయి. వాటిల్లో.. వెల్లుల్లి ముఖ్యమైనదిగా చెప్పొచ్చు.

అవును వెల్లుల్లితో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిని రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అయితే, వెల్లుల్లితో ఇమ్యూనిటీ మాత్రమే కాదు.. పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. లైంగిక సమస్యతో సతమతం అవుతున్న వారు వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మరి వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు ఏంటి? అందులోని ఉండే పోషకాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఔషధ మూలకం ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో విటమిన్-బి, విటమిన్-సి కూడా అధికంగా ఉంటుంది. దీంతో పాటు.. సెలీనియం, మాంగనీస్ కాల్షియం వంటి మూలకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మూలకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వెల్లుల్లి వాడకం ఆరోగ్యానికి ఎంతో స్పెషల్..

వెల్లుల్లిని వర్షాకాలంలో తినడం వలన గొంతు, ఉదర సంబంధిత వ్యాధుల దరిచేరకుండా ఉంటాయి. వెల్లుల్లిలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కడుపులో పేరుకుపోయిన సూక్ష్మీజీవులు, క్రిములు నాశనం అవుతాయి. వెల్లుల్లి జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుతుంది..

ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది పురుషులు లైంగిక సంబంధిత సమస్యతో సతమతం అవుతున్నారు. అయితే, వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే పదార్థం.. పురుషుల్లో లైంగిక పరమైన హార్మోన్లను ప్రేరేపిస్తుంది. అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది. వెల్లుల్లిలోని విటమిన్లు, సెలీనియం.. స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి.

వెల్లుల్లిని రోజులో ఎంత తినాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 4 గ్రాముల పచ్చి వెల్లుల్లి అంటే ఒకటి, రెండు వెల్లుల్లి మొగ్గలు తినాలి. అదే సమయంలో, కూరగాయలలో 5-7 మొగ్గలు వేయాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వెల్లుల్లిని ఏ సమయంలో తినాలి?

వెల్లుల్లిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. దీన్ని ఎప్పుడైనా తినవచ్చు. అయితే, ఖాళీ కడుపుతో తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి 2 వెల్లుల్లి రిబ్బలను తినవచ్చు.

వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..

1. జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

2. జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.

3. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది.

4. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

5. బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!