AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర.. హవాలా డబ్బు కేసులో మరొకరు అరెస్టు.. విచారణ వేగవంతం..

హ్యాండ్‌ గ్రెనేడ్లతో దసరా వేడుకల్లో హైదరాబాద్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని పథకం వేసి నగర పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులకు గతంలో నగదు సమకూర్చిన ఫైనాన్షియర్‌ తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు...

Hyderabad: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర.. హవాలా డబ్బు కేసులో మరొకరు అరెస్టు.. విచారణ వేగవంతం..
Terror Attack In Hyd
Ganesh Mudavath
|

Updated on: Feb 17, 2023 | 11:33 AM

Share

హ్యాండ్‌ గ్రెనేడ్లతో దసరా వేడుకల్లో హైదరాబాద్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని పథకం వేసి నగర పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులకు గతంలో నగదు సమకూర్చిన ఫైనాన్షియర్‌ తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఇన్సిడెంట్ ను సీరియస్ గా తీసుకున్న సిట్.. హవాలా రూపంలో వచ్చిన నగదు సరఫరాలో కీలక పాత్ర పోషించిన వారికోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది. నగదు సమకూర్చిన వారిలో కీలక నిందితుడు, పాతబస్తీకి చెందిన హవాలా ఆపరేటర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ఖలీమ్‌ను సిట్‌ అరెస్ట్‌ చేసింది. గతేడాది దసరా ఉత్సవాల సందర్భంగా బాంబులు పేల్చాలనుకున్నారు. దీంతో భారీ ప్రాణనష్టం కల్పించడంతో పాటు.. హైదరాబాద్‌లో మత కల్లోహాలు సృష్టించి అశాంతిని రేకిత్తించేందుకు కుట్ర పన్నారు.

అయితే విషయం తెలుసుకున్న పోలీసులు.. ఈ కేసులో గతేడాది అక్టోబర్‌ 2న హైదరాబాద్‌ పోలీసులు లష్కరే తోయిబా ఉగ్రవాదులైన అబ్దుల్‌ జాహెద్, మహ్మద్‌ సమీయుద్దీన్, మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌లను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి నాలుగు హ్యాండ్‌ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్దిఖ్‌ బిన్‌ ఉస్మాన్, అబ్దుల్‌ మాజిద్‌లు ఇ‍చ్చిన ఆదేశాలతో ఆ ముగ్గురూ ఉగ్రకుట్ర ప్రణాళికలు సిద్ధం చేశారు.

హవాలా మార్గంలో రూ.40 లక్షలు ఇచ్చేందుకు పాతబస్తీకి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖలీమ్‌ సహకరించినట్లు దర్యాప్తు తేలింది. దీంతో అతనిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. దర్యాప్తులో ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించిన వారిపై ఇప్పుడు సిట్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే హవాలా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ముమ్మర విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా వచ్చిన డబ్బుతో ముగ్గురు ఉగ్రవాదులు రెండు ఇన్‌ఫీల్డ్‌ బైక్‌లు కొనడంతో పాటు ఒక కారును కూడా కొనడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..