Telugu News India News Father son duo shot at after dispute over car parking in Delhi Telugu News
పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం.. తండ్రీ కొడుకులపై కాల్పులు
నిన్న రాత్రి తన తండ్రి, సోదరుడు వివాహ వేడుక నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, పార్కింగ్ స్థలంలో దారిని అడ్డగిస్తూ ఒక వాహనం ఆగి ఉంది. ఆ వాహనాన్ని తొలగించాలని కోరిన క్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగింది
దేశ రాజధాని ఢిల్లీలో రోజుకో దారుణం వెలుగు చూస్తోంది. రాజధాని అంటేనే సామాన్యులు భయంతో వణికిపోయేలా మారుతోంది పరిస్తితి. తాజాగా ఢిల్లీలో జరిగిన మరో షాకింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పార్కింగ్ విషయంలో తలెత్తిన తగాదా.. చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇద్దరు వ్యక్తుల మధ్య మాటా మాటా పెరిగి చివరికి హత్య వరకు వెళ్లింది. ఢిల్లీలోని యమునా విహార్ ప్రాంతంలోని ఓ సొసైటీలో కారు పార్కింగ్ వివాదంలో తండ్రి కొడుకులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. చిన్నపాటి వివాదంతో ఇద్దరి ప్రాణాలకు మీదకు తెచ్చిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఒక్కసారిగా జరిగిన ఊహించని ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పాడింది. గాయపడిన తండ్రీకొడుకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.. అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుడి కుమారుడు సౌరభ్ అగర్వాల్ తెలిపిన వివరాల మేరకు..
Delhi | Soon after the car owner gathered 10-15 people with guns. Then, one person from this group fired bullets injuring my father & brother. My father who is in critical condition & brother injured are admitted to a private hospital: Saurabh Aggarwal pic.twitter.com/lgS397HoiS
నిన్న రాత్రి తన తండ్రి, సోదరుడు వివాహ వేడుక నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, పార్కింగ్ స్థలంలో దారిని అడ్డగిస్తూ ఒక వాహనం ఆగి ఉంది. ఆ వాహనాన్ని తొలగించాలని కోరిన క్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగింది. వివాదంతో దుండగులు రెచ్చిపోయారు. ఆ వెంటనే తండ్రీ కొడుకులపై 10 నుండి 12 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా చెప్పాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. బాధితులు వీరేంద్ర కుమార్ అగర్వాల్, అతని కుమారుడు సచిన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.