Trending Video: ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి..అందరి దిష్టి పోవాలి.. నా మనవడిపైనే అందరి కళ్లన్నీ..
సాధారణంగా చిన్నపిల్లలు అస్వస్థతకు గురైతే.. వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లడమో, లేక మెడిసిన్స్ ఇవ్వడమో వంటివి చేస్తుంటాం. కానీ.. ఇంట్లో ఉండే అమ్మమ్మ లేదా నానమ్మ వంటి పెద్దవాళ్లు.. దిష్టి తగిలిందేమోనని..

సాధారణంగా చిన్నపిల్లలు అస్వస్థతకు గురైతే.. వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లడమో, లేక మెడిసిన్స్ ఇవ్వడమో వంటివి చేస్తుంటాం. కానీ.. ఇంట్లో ఉండే అమ్మమ్మ లేదా నానమ్మ వంటి పెద్దవాళ్లు.. దిష్టి తగిలిందేమోనని భావించి దిష్టి తీస్తుంటారు. ఇలా చేయడం చాలా మందికి తెలిసిందే. దిష్టి తీయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందో లేదో తెలియదు కానీ.. ఈ నమ్మకం మాత్రం భారతీయ సమాజంలో బలంగా నాటుకుపోయింది. నేటి డిజిటల్ యుగంలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ ఉంది. సోషల్ మీడియాలో ప్రజలు ఎప్పుడూ ఏదో ఒకదాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. వీటిలో నెటిజన్లను ఎక్కువగా అలరించే వీడియోలు వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం అలాంటి వైరల్ వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.
సైన్స్‌ని ఎంత నమ్మినా గ్రంథాలలో రాసిన విషయాలను పూర్తిగా కాదనలేం. ఇంటి పెద్దలు తమ పిల్లలకు ఆప్యాయత, దీవెనలు ఇవ్వడంలో ఏమాత్రం వెనకాడరు. పిల్లలు మనవళ్లైతే ఈ ప్రేమ మరింత పెరుగుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో వృద్ధురాలితో పాటు ఓ చిన్నారి కూర్చుని ఉండటాన్ని చూడవచ్చు. పిల్లవాడు ఆమె దగ్గరికి వెళ్లగానే.. ఆమె చేస్తున్న పనిని ఆపి, దిష్టి తీయడం స్టార్ట్ చేసింది.




दवा काम ना आए तो नजर भी उतारती है, ये मां है साहब, हार कहां मानती है…❤️https://t.co/0K24Kq6Q5p pic.twitter.com/B5sdXvKrqm
— Mahant Adityanath 2.0? (Parody) (@MahantYogiG) January 31, 2023
ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీడియోకు ఏడు లక్షలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..