AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు.. టికెట్ ధర ఎంతంటే?

IRCTC 7 Jyotirlinga Darshan Yatra: శైవ భక్తులకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను అందిస్తోంది. సికింద్రాబాద్ నుంచి జూన్ 16న ప్రారంభమయ్యే ఈ 11 రోజుల టూర్‌లో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగాలతో పాటు ద్వారక వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉంది. టికెట్ ధరలు రూ.17,600 నుంచి ప్రారంభమవుతున్నాయి.

IRCTC Tour Package: ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు.. టికెట్ ధర ఎంతంటే?
Irctc Tour Package
Rajashekher G
|

Updated on: May 30, 2026 | 4:57 PM

Share

Sapta Jyotirlinga Tour: శైవ భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త అందించింది. దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకునేలా “సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర” పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ఏడు ప్రసిద్ధ జ్యోతిర్లింగాలతో పాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.

జూన్ 16న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు కొనసాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాత్రికులకు సికింద్రాబాద్‌తో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్లలో ఎక్కే సౌకర్యం అందుబాటులో ఉంది.

యాత్రలో దర్శించుకునే ప్రధాన క్షేత్రాలు

  1. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం – ఉజ్జయిని
  2. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం – మధ్యప్రదేశ్
  3. ద్వారకాధీశ్ ఆలయం – గుజరాత్
  4. నాగేశ్వర్ జ్యోతిర్లింగం – ద్వారక సమీపంలో
  5. సోమనాథ్ జ్యోతిర్లింగం – గుజరాత్
  6. భీమశంకర్ జ్యోతిర్లింగం – మహారాష్ట్ర
  7. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం – నాసిక్
  8. ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగం – ఛత్రపతి శంభాజీనగర్

ప్రయాణ ప్రణాళిక

యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ మహాకాళేశ్వర్ దర్శనం అనంతరం ఓంకారేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత గుజరాత్‌లోని ద్వారక, నాగేశ్వర్, సోమనాథ్ క్షేత్రాల దర్శనం ఉంటుంది. అనంతరం మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

టికెట్ ధరలు

  • ఎకానమీ (స్లీపర్ క్లాస్) పెద్దలు: రూ.17,600 5 నుంచి 11 ఏళ్ల పిల్లలు: రూ.16,300
  • స్టాండర్డ్ (3ఏసీ) పెద్దలు: రూ.26,700 పిల్లలు: రూ.25,200
  • కంఫర్ట్ (2ఏసీ) పెద్దలు: రూ.34,600 పిల్లలు: రూ.32,800

ప్యాకేజీలో లభించే సదుపాయాలు

  • ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం (శాకాహారం)
  • హోటల్ బస
  • స్థానిక దర్శనాల కోసం వాహన సౌకర్యం
  • ట్రావెల్ ఇన్సూరెన్స్
  • టూర్ మేనేజర్ల సహాయం
  • రైలు ప్రయాణంలో భద్రతా ఏర్పాట్లు

అయితే ఆలయాలు లేదా పర్యాటక ప్రాంతాల్లో ఉండే ప్రత్యేక ప్రవేశ రుసుములు, అదనపు వ్యక్తిగత సదుపాయాల ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుంది.

శైవక్షేత్రాల దర్శనం కోసం తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన యాత్ర చేయాలనుకునే భక్తులకు ఈ ప్యాకేజీ మంచి అవకాశం అని చెప్పొచ్చు.

సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్
ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్
సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!