Yamuna Pushkaralu 2026: యమునా పుష్కరాలు జూన్ 2 నుంచి.. పుష్కర స్నానం చేసే వారికి కలిగే అద్భుత ఫలితాలు ఇవే!
Yamuna Pushkaralu 2026: హిందూ సంప్రదాయంలో పుష్కరాలకు విశేష ప్రాధాన్యం ఉంది. దేవగురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించడంతో యమునా పుష్కరాలు నిర్వహించబడతాయి. ఈ పవిత్ర సమయంలో భక్తులు యమునా నదిలో స్నానాలు చేసి పూజలు, దానధర్మాలు నిర్వహిస్తారు.

Yamuna Pushkaram Significance: హిందూ సంప్రదాయంలో పుష్కరాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవగురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఆ రాశికి అనుసంధానమైన పవిత్ర నదికి పుష్కర మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు వస్తాయి. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించే సందర్భంగా యమునా నది పుష్కరాలు నిర్వహించబడతాయి. ఈ పవిత్ర కాలంలో లక్షలాది మంది భక్తులు యమునా తీరాలకు చేరుకుని స్నానాలు, పూజలు, దానధర్మాలు నిర్వహిస్తారు.
పుష్కరాల్లో తొలి 12 రోజులను ఆది పుష్కరాలు, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని పిలుస్తారు. ఈ సమయంలో యమునా నదిలో స్నానం చేయడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని, పితృదోషాలు తొలగుతాయని పురాణ విశ్వాసం.
యమునా పుష్కరాలు 2026 తేదీలు
2026 సంవత్సరంలో యమునా పుష్కరాలు జూన్ 2, మంగళవారం ప్రారంభమై జూన్ 13, శనివారంతో ముగుస్తాయి.
యమునా పుష్కరాల ప్రధాన ఘాట్లు
మధురలో ప్రముఖ ఘాట్లు
- శ్రీకృష్ణ జన్మభూమిగా ప్రసిద్ధి చెందిన మధురలో భక్తులు సందర్శించదగిన ఘాట్లు: బెంగాలీ ఘాట్, విశ్రాంత్ ఘాట్, స్వామి ఘాట్, కంస ఘాట్, చక్రతీర్థ ఘాట్
- బృందావనంలోని పుష్కర ఘాట్లు.. కేశీ ఘాట్, చీర ఘాట్, కాలీయ ఘాట్, ఇమ్లీ తాలా ఘాట్
- ప్రయాగరాజ్ ప్రాంతంలో.. త్రివేణి సంగమం, సరస్వతీ ఘాట్, అరైల్ ఘాట్
- ఢిల్లీలో.. నిగంబోధ్ ఘాట్, వజీరాబాద్ ఘాట్
- అలాగే యమునోత్రి, ఆగ్రా ప్రాంతాల్లో కూడా పుష్కర స్నానాలు నిర్వహిస్తారు.
పుష్కరాల్లో చేయదగిన పుణ్యకార్యాలు
యమునా పుష్కరాల సమయంలో భక్తులు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా పుష్కర స్నానం, పితృ తర్పణాలు, పిండ ప్రదానాలు, దానధర్మాలు, దీపదానం, యమునా హారతి, గాయత్రీ మంత్ర జపం, గోపూజ.. ఇవన్నీ ఆధ్యాత్మిక శాంతి, పుణ్యఫలాలను అందిస్తాయని విశ్వసిస్తారు.
పుష్కరాల్లో 12 రోజుల దానాల విశిష్టత
- మొదటి రోజు: ధనం, ధాన్యాలు, భూమి, బంగారం, వెండి దానం చేయడం శుభప్రదం.
- రెండో రోజు: వస్త్రదానం, రక్తదానం, ఉప్పు దానం చేయడం మంచిదిగా భావిస్తారు.
- మూడో రోజు: పూలు, బెల్లం దానం చేయడం ద్వారా శుభఫలాలు లభిస్తాయని నమ్మకం.
- నాలుగో రోజు: నువ్వులు, నెయ్యి, పాలు, తేనె దానం చేయడం శ్రేయస్కరం.
- ఐదో రోజు: ధాన్యదానం, ఎద్దుల దానం వంటి సేవాకార్యాలు చేయడం మంచిది.
- ఆరవ రోజు: చందనం, కస్తూరి, ఔషధ దానాలు చేయడం శుభప్రదం.
- ఏడో రోజు: పీటలు, మంచాలు, గృహ అవసర వస్తువులు దానం చేయడం ఉత్తమం.
- ఎనిమిదో రోజు: చందనం, కందమూలాలు, పుష్పమాలలు దానం చేయవచ్చు.
- తొమ్మిదో రోజు: పిండదానం, కంబళి దానం వంటి కార్యక్రమాలు చేయడం మంచిదిగా చెబుతారు.
- పదో రోజు: కూరగాయలు, పండ్లు వంటి ఆహార పదార్థాలను దానం చేయడం శ్రేయస్కరం.
- పదకొండో రోజు: గజదానం విశేష పుణ్యఫలితాలను ఇస్తుందని పురాణాలు పేర్కొంటాయి.
- పన్నెండో రోజు: నువ్వుల దానం చేయడం ద్వారా ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




