AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyeshtha Purnima: జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ధనం వెల్లువలా వస్తుందట!

Jyeshtha Purnima 2026: హిందూ సంప్రదాయంలో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు దానాలు, పూజలు, పితృ తర్పణాలు చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. 2026లో జ్యేష్ఠ పౌర్ణమి అరుదైన శుభ గ్రహస్థితుల్లో రావడంతో ఈ రోజున చేసే దీపారాధనలు, పూజలు ఐశ్వర్యం, కుటుంబ శాంతి, అదృష్టాన్ని కలిగిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Jyeshtha Purnima: జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ధనం వెల్లువలా వస్తుందట!
Jyeshtha Purnima 2026
Rajashekher G
|

Updated on: May 29, 2026 | 1:13 PM

Share

హిందూ సంప్రదాయంలో ప్రతి పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ధర్మకార్యాలు, దానాలు, పూజలు, పితృ తర్పణాలకు ఈ రోజు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈసారి 2026 జ్యేష్ఠ పౌర్ణమి అరుదైన శుభ గ్రహ స్థితుల మధ్య రావడం వల్ల.. ఈ రోజున చేసే పూజలు, దీపారాధనలు జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఐశ్వర్యం, కుటుంబ శాంతి, అదృష్టం కోరుకునే వారు ఈ రోజును ఎంతో భక్తితో ఆచరిస్తారు.

శుభ ఫలితాలు కలగాలంటే..

పంచాంగ వివరాల ప్రకారం.. జ్యేష్ఠ పౌర్ణమి తిథి 2026 మే 30వ తేదీ శనివారం ఉదయం 11:57 గంటలకు ప్రారంభమై.. మే 31వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:14 గంటల వరకు కొనసాగుతుంది. పూజలు, వ్రతాలు మే 30న నిర్వహించగా.. స్నానాలు, దానధర్మాలు, తర్పణాలు మే 31న చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు. ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే చంద్రోదయ సమయంలో చంద్రుడిని దర్శించి ప్రార్థనలు చేస్తే మానసిక ప్రశాంతత, శుభఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.

పితృదోషాలు తగ్గాలంటే..

జ్యేష్ఠ పౌర్ణమి రోజున పితృదేవతలను స్మరించడం కూడా అత్యంత ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. పవిత్ర స్నానం అనంతరం తర్పణం, పిండప్రదానం, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పితృదోషాలు తగ్గి కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని పురాణ విశ్వాసం. అందుకే చాలామంది ఈ రోజున దానధర్మాలు చేసి పితృదేవతల ఆశీర్వాదం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

లక్ష్మీదేవి కటాక్షం..

ఇంటి శ్రేయస్సు కోసం కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. ముఖ్యంగా వంటగదిలో దీపం వెలిగించడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తారు.

పౌర్ణమి ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీరు పోసి.. నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వడం కూడా ఎంతో శుభప్రదంగా చెబుతారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కారణంగా.. ఈ పూజ వల్ల ఇంట్లో సంపద, ఆరోగ్యం, ప్రశాంతత పెరుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా మహిళలు కుటుంబ శ్రేయస్సు కోసం ఈ ఆచారాన్ని భక్తితో నిర్వహిస్తుంటారు.

అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రాత్రి పవిత్ర నదుల్లో దీపాలను ప్రవాహంలో వదలడం కూడా ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన సంప్రదాయంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక అశాంతి తగ్గి.. పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతికూల శక్తులు తొలగి సానుకూలత పెరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే ఈసారి జ్యేష్ఠ పౌర్ణమిని భక్తిశ్రద్ధలతో ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us