AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం గంజి ఆరోగ్య రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు..! అస్సలు వదలకుండా వాడేయండి..!!

గంజి తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక శరీర సమస్యలను నయం చేస్తుంది.

అన్నం గంజి ఆరోగ్య రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు..! అస్సలు వదలకుండా వాడేయండి..!!
Rice Water
Jyothi Gadda
|

Updated on: Feb 17, 2023 | 1:50 PM

Share

భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఆహారం బియ్యం. దీన్ని రకరకాలుగా వండుకోవచ్చు. సాధార‌ణంగా చాలా మంది అన్నం వండేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోసి గంజిని వారుస్తుంటారు. కానీ మీరు అలా చేయడం తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వండిన అన్నం గంజి వార్చేస్తే… చాలా వరకు పోషకాలు వృథా అవుతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. గంజి తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను అనేకం ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా.. గంజిలో అధిక పోషకాలు ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ ఇందులో పుష్కలంగా లభిస్తాయి.

– గంజి తాగడం వల్ల శరీరానికి త్వరిత శక్తి అందుతుంది, దీని వల్ల శరీరం యొక్క అలసట చాలా వరకు పోతుంది.

– గంజి మన చర్మానికి చాలా మేలు చేస్తుంది. అతినీలలోహిత కిరణాలు, ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గించే శక్తి గంజికి ఉంది. అన్నంలోంచి వంచిన గంజి నీటిని ముఖానికి పట్టించటం కూడా ప్రయోజనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

– ఈ రోజుల్లో చాలా మంది జుట్టు నెరవడం, జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. గంజిని తలకు పట్టించి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూ, కండీషనర్‌తో జుట్టును కడగాలి.

– వండిన అన్నం గంజిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల ముఖంలోని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.

– గంజి వినియోగం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలలో నిరూపించబడింది.

– గంజిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

– నిత్యం అన్నం గంజి తాగే వారి శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.

– మీరు హైపోటెన్షన్ లేదా తక్కువ రక్తపోటుతో పోరాడుతున్నట్లయితే గంజిలో ఉప్పు కలుపుకుని తాగొచ్చు.

– వైరల్ ఫీవర్ లో గంజి తక్కువేమీ కాదు, కాస్త ఉప్పు కలిపి తాగితే జ్వరం త్వరగా మాయమవుతుంది.

– గంజి తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక శరీర సమస్యలను నయం చేస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..