Skin Care Tips: చర్మం ముడతలు పడుతోందని భయమా..? అయితే ఇలా చేస్తే మెరిసే మేని మీ సొంతం..
ఆరోగ్యకరమైన మెరిసే,యవ్వన చర్మంలో కొల్లాజెన్ కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇది తగ్గితే..కీళ్ల నొప్పులు, చర్మంపై ఏజింగ్ సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మం బాగుండాలంటే కొల్లాజెన్ బాగుండాలి. మరి దీనిని పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
కొల్లాజెన్ అనేది శరీరంలో అతి ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్సుల్లో ఒకటి. ఇది చర్మం, నిర్మాణం, మృదుత్వాన్నిపెంచడంలో కీలకంగా వ్యవహారిస్తుంది. కాబట్టి ఇది మీ చర్మానికి యవ్వనాన్ని అందిస్తుంది. అంతేకాదు మృదులాస్థి, స్నాయువుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సహాయపడుతుంది. కీళ్ల సమస్యలతో బాధపడేవారు, చర్మంపై ముడతలతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు కచ్చితంగా కొల్లాజిన్ ఉండే ఆహారాలను తమ డైట్లో చేర్చుకోవాల్సిందే. మన చర్మం కొల్లాజెన్ కోల్పోయిందని తెలపడానికి సంకేతాలు ముఖంపై ముడతలు, సాగే చర్మం, వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. పొగాకు, UVకిరణాలు, కాలుష్యం, ఇతర కారణాలతోపాటు ఒత్తిళ్ల వల్ల కూడా కొల్లాజెన్ దెబ్బతింటుంది. అందుకే చిన్న వయస్సు నుండే మన చర్మంలోని కొల్లాజెన్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం.
ఆరోగ్యకరమైన, మెరిసే, యవ్వనంగా కనిపించే చర్మం కావాలంటే..మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి.
విటమిన్ సి, రెటినాయిడ్స్:
విటమిన్ సి చర్మాన్ని రక్షించడంలో, అదనపు కొల్లాజెన్‌ని సృష్టించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ ఆహారంలో ఈ విటమిన్‌ను చేర్చుకోవడం ద్వారా, మీ శరీరం యొక్క సహజ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో ఇప్పటికే మీ శరీరం కలిగి ఉన్న కొల్లాజెన్‌ను రక్షించుకోవచ్చు. ఉదయాన్నే విటమిన్ సి ఉన్న పదార్థాలు తీసుకోండి. మీరు బ్రోకలీ, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, ఆకు కూరలు, సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు) లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచుగా ఆహారంలో చేర్చుకోండి.
రెటినోయిడ్/రెటినోల్ అనేది విటమిన్ ఎ డెరివేటివ్‌లు. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిలో పాల్గొన్న జన్యువులను అధికం చేస్తాయి. బఠానీ పరిమాణంలో రెటినోల్‌ను మీ ముఖానికి ప్రతి రాత్రి పూయండి. రెటినోల్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని పునరుద్ధరణ చేయడంలో ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
పెప్టైడ్స్, రసాయన పీల్స్:
పెప్టైడ్స్ ను పాలీపెప్టైడ్స్ అని కూడా పిలుస్తారు. వీటిని అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇవి చర్మానికి అవసరమైన కొన్ని ప్రోటీన్‌లను తయారు చేస్తాయి. కొల్లాజెన్ అనేది మూడు పాలీపెప్టైడ్ గొలుసులతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి పెప్టైడ్‌లను చేర్చడం వల్ల కొల్లాజెన్‌ను తయారు చేయడానికి మీ చర్మాన్ని ప్రేరేపిస్తుంది. దీంతో మీ చర్మం దృఢంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
కెమికల్ పీల్ ద్వారా చర్మాన్ని బాగుపరిచే పద్దతి. చర్మ సంబంధితమైన సమస్యలైన హైపర్ పిగ్మెంటేషన్, ముడతలు, చారలు, మొటిమలు, మచ్చలు, నల్లమచ్చలు వంటివి నివారించడానికి వీటిని ఉపయోగిస్తారు ఈ చికిత్సలో యాసిడ్లని, పాడైన చర్మ పైపొరని తీసేయడానికి వాడతారు.
సన్‌స్క్రీన్, యాంటీఆక్సిడెంట్లు:
యూవీ కిరణాల వల్ల కొల్లాజెన్ దెబ్బతింటుంది. అందుకే మీ చర్మానికి తరచుగా సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. మీరు ఎక్కువగా బయట తిరగాల్సి వస్తే రోజుకు ఒకటి లేదా రెండు సార్లు సన్ స్క్రీన్ ఉపయోగించండి.
మీ చర్మానికి వాపు నుంచి ఉపశమనం కల్పించడంతోపాటు హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను అరికట్టడంలో యాంటీఆక్సిడెంట్లు అవసరం. యాంటీఆక్సిడెంట్ రిచ్ స్కిన్‌కేర్ ఉత్పత్తులు మీ శరీరంలో కొత్తగా కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అంతేకాదు ప్రస్తుతం ఉన్న కొల్లాజెన్‌ను రక్షించస్తాయి. ఆప్రికాట్లు, ఆస్పరాగస్, దుంపలు, బ్రోకలీ, క్యారెట్, బెల్ పెప్పర్స్, కాలే, మామిడి, పెకాన్స్, బెర్రీలు, బచ్చలికూర వంటి ఆహారాలను కూడా మీ ఆహారంలో చేర్చుకోండి.
సప్లిమెంట్లు, పోషకమైన ఆహారం:
ప్రధానంగా ప్రోటీన్ (కాయధాన్యాలు, బీన్స్, గుడ్లు, చికెన్, చేపలు), తృణధాన్యాలు (బ్రౌన్ రైస్, మిల్లెట్స్, క్వినోవా మొదలైనవి) ఆరోగ్యకరమైన కొవ్వులు (ఆలివ్ ఆయిల్, అవకాడోలు, కొబ్బరి నూనె) ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వీటితోపాటుగా తాజా కూరగాయలు, పండ్లు, అలాగే గింజలు, విత్తనాలు కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ప్రాసెస్ చేసిన, ట్రాన్స్-ఫ్యాట్ అధికంగా ఉన్న, డీప్ ఫ్రైడ్, చక్కెర (ఫిజ్జీ డ్రింక్స్, బిస్కెట్లు మొదలైనవి) అధికంగా ఉండే ఆహారాలు మీ చర్మ కాంతిని తగ్గిస్తాయి. మీ హార్మోన్లను అసమతుల్యతను కలిగిస్తాయి. హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు పుష్కలంగా తాగాలి.
ధూమపానం, ఆల్కహాల్ కు దూరంగా ఉండండి. కెఫిన్ పరిమితంగా తీసుకోవాలి. సప్లిమెంట్ల కోసం, కొల్లాజెన్, జింక్, కోఎంజైమ్ Q10, పెప్టైడ్‌లు మీ చర్మాన్నికాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
వ్యాయామం, బాగా నిద్రపోండి:
వ్యాయామంతో మన చర్మానికి ఆక్సిజన్, పోషకాలను అందించే రక్త ప్రసరణ పెరుుతుంది. ఆక్సిజన్, పోషకాలు పునరుత్పత్తిలో చర్మ కణాలకు సహాయపడతాయి. కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసే ఫైబ్రోబ్లాస్ట్ కణాలకు ఆహారం ఇస్తాయి. అలాగే మంచి నిద్ర మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
మీరు నిద్రిస్తున్న సమయంలోనే మీ శరీరం, చర్మం తమను తాము రిపేర్ చేసుకుంటాయి. మీ నిద్రలో కొల్లాజెన్, ఎలాస్టిన్ వంటి చర్మ ప్రొటీన్ల ఉత్పత్తి వేగవంతం అవుతుంది. మీరు ప్రతి రాత్రి 8 గంటలు పాటు నిద్రపోయేలా చూసుకోండి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..