Sunday Funday: ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు.. నగర వాసులకు ఆటవిడుపు సండే ఫన్‌డేకు రెడీ..

భాగ్యనగర వాసులను ఆహ్లాద పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది.. యాంత్రికత నుంచి బయటకు వచ్చి.. ఆనందం నింపేందుకు.. ఆహ్లదం పంచేందుకు.. జీవితంలోని కొన్ని గంటలను అయినా మధుర జ్ఞాపకాలుగా మలిచేందుకు ప్రభుత్వం సన్‌డే ఫన్‌డే వంటి ప్రోగ్రాం చేపట్టింది

Sunday Funday: ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు.. నగర వాసులకు ఆటవిడుపు సండే ఫన్‌డేకు రెడీ..
Sunday Fun Day At Tankband
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2023 | 6:44 AM

నేటి యువత కాలంతో పోటీపడుతూ.. పరుగులు పెడుతూ జీవించాల్సి వచ్చింది.  వాస్తవానికి క్షణం తీరిక లేకుండా ఇల్లు, ఉద్యోగం.. చదువు అంతకు మించి జీవితంలో మారేది లేదన్నట్లు బతికేస్తున్నారు. ముఖ్యంగా నగర వాసులు యాంత్రిక జీవనంతో అలసిపోతున్నారు. దీంతో నగరవాసుల ఆటవిడుపు కోసం.. సరదాగా గడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. భాగ్యనగర వాసులను ఆహ్లాద పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది.. యాంత్రికత నుంచి బయటకు వచ్చి.. ఆనందం నింపేందుకు.. ఆహ్లదం పంచేందుకు.. జీవితంలోని కొన్ని గంటలను అయినా మధుర జ్ఞాపకాలుగా మలిచేందుకు ప్రభుత్వం సన్‌డే ఫన్‌డే వంటి ప్రోగ్రాం చేపట్టింది. ఇప్పటికే ఇది నగరవాసుల మనసులను దోచుకుంది. మన్ననలను పొందింది. ఈ  ట్యాంక్‌బండ్‌పై ఇవాళ సన్‌డే కార్యక్రమం  నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఇవాళ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. సరికొత్త ఆటవిడుపులతో ట్యాంక్‌బండ్‌పై ఇవాళ సన్‌డే ఫన్‌డే నిర్వహిస్తున్నారు అధికారులు. సన్‌డే ఫన్‌డే నిర్వహణపై రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. దీంతో ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్షలు అమ‌ల్లో ఉంటాయని తెలిపారు.

ఫార్ములా ఈ రేసింగ్ కార‌ణంగా గ‌త కొన్ని వారాల నుంచి సండే ఫ‌న్‌డే కార్యక్రమాన్ని నిలిపివేశారు. సాయంత్రం సండే ఫ‌న్‌డే కార్యక్రమం కోసం ట్యాంక్ బండ్ సంద‌ర్శకుల కోసం ప‌రిస‌ర ప్రాంతాల్లో 4 పార్కింగ్ ప్రదేశాల‌ను ఏర్పాటు చేశారు. ఇక‌పై హుస్సేన్ సాగ‌ర్‌లో ఏర్పాటు చేసిన మ్యూజిక‌ల్ ఫౌంటెయిన్ ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిల‌వ‌నుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?