YS Sharmila: మహబూబాబాద్‌లో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న పోలీసులు
షర్మిలను తన సొంత వాహనంలో కాకుండా పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీసులు తీసుకెళ్లారు. అక్కడి నుంచి షర్మిలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పాదయాత్రను
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. తన కారవాన్‌లోకి వెళ్లి షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను తన సొంత వాహనంలో కాకుండా పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. అక్కడి నుంచి షర్మిలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పాదయాత్రను మహబూబాబాద్ బేతోలులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి షర్మిల బసచేసిన సాలార్ తాండా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దఎత్తున చేరుకున్న శంకర్ నాయక్ అనుచరులు, కార్యకర్తలు.. షర్మిల ఫ్లెక్సీలను తగలబెట్టారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
సొంత ప్రయోజనాల కోసమే వలసవాదులు పాదయాత్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వ్యాఖ్యలపై.. కౌంటర్ ఎటాక్ చేశారు వైఎస్ఆర్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా. అభివృద్ధిని మరిచిపోయిన శంకర్‌నాయక్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..