AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake in Temple: శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే నాగు పాము దర్శనం.. శివుని ప్రతిరూపంగా భావించి పూజలు

మహా పర్వదినం శివరాత్రి రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది. మహా శివుడి కంఠాభరణం అయిన నాగు పాము భక్తులకు దర్శనం ఇచ్చింది. ఇది చూసిన భక్తులు ఆ పరమ శివుని ప్రతిరూపంగా భావించి భక్తితో పరవిశించిపోయారు.

Snake in Temple: శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే నాగు పాము దర్శనం.. శివుని ప్రతిరూపంగా భావించి పూజలు
Snake In Temple
Surya Kala
|

Updated on: Feb 19, 2023 | 10:12 AM

Share

మహా శివరాత్రి  రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి ఆ పరమ శివుడిని దర్శించుకున్నారు. అయితే మహా పర్వదినం శివరాత్రి రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది. మహా శివుడి కంఠాభరణం అయిన నాగు పాము భక్తులకు దర్శనం ఇచ్చింది. ఇది చూసిన భక్తులు ఆ పరమ శివుని ప్రతిరూపంగా భావించి భక్తితో పరవిశించిపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో  చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..

నిర్మల్ జిల్లా దస్తూరబాద్ మండలంలో మహాశివరాత్రి వేళ మహా అద్బుతం చోటు చేసుకుంది. రాత్రి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే నాగు పాము దర్శనం.. లయకారుడైన శంకరుడు కంఠాభరమైన నాగుపాము భక్తులకు దర్శనం ఇచ్చింది. మండలంలోని గొడిసేర్యాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము దర్శనం ఇచ్చింది. నాగుపాముని చూసిన స్థానికులు భక్తి పరవశులయ్యారు. పాముకు భక్తితో పూజలు చేసి పాలు సమర్పించారు. నాగుపాము పడగవిప్పి భక్తులను ఆశ్వీరదించినట్లుగా ప్రత్యక్షమైంది. మహా శివరాత్రి పర్వదినాన నాగు పాము దర్శనంతో తమ జన్మ ధన్యమైందని  స్థానికులు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నాగుపాముని దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
ఇవాళే OTTకి వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. IMDBలో 9.6 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. IMDBలో 9.6 రేటింగ్
రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం
రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం
ICAI CA మే 2026 పరీక్షల తేదీలు మారాయ్‌.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ICAI CA మే 2026 పరీక్షల తేదీలు మారాయ్‌.. హాల్ టికెట్ల లింక్ ఇదే
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!