AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mystery Shiva Temple: సైన్స్‌కి సవాల్ ఈ ఆలయం.. రోజుకు 3 సార్లు రంగులు మార్చే శివలింగం..

శివలింగం రోజు మూడుసార్లు రంగులు మారుస్తుంది.  ఉదయంవేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో..  సాయంత్రం వేళ చామర ఛాయగా (నీలం) రంగుల్లోకి మారి.. భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకూ ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు.

Mystery Shiva Temple: సైన్స్‌కి సవాల్ ఈ ఆలయం.. రోజుకు 3 సార్లు రంగులు మార్చే శివలింగం..
Achaleshwar Mahadev Temple
Surya Kala
|

Updated on: Feb 18, 2023 | 9:03 AM

Share

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.. వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలకు నెలవు. ఈ ఆలయాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో కూడా ఉంది. దీని గురించి వింటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది. సైన్స్ కు సవాల్ కు విసురుతూనే ఉంది.  వాస్తవానికి, ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం రోజుకు మూడు సార్లు దాని రంగును మార్చుకుంటుంది. చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని ‘అచలేశ్వర్ మహాదేవ్’ దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం దుర్భరమైన భూభాగంలో ఉన్నందున, ఇంతకుముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు.. క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత..  భక్తులు సంఖ్య పెరిగింది. ముఖ్యంగా శ్రావణ మాసంలోనూ శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. రంగురంగులు మారుస్తున్న  శివలింగం గురించి  అనేక రకాల కథలు వాడుకలో ఉన్నాయి. మరి రోజులో మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏమిటో తెలుసుకోవటానికి రాజస్థాన్ వెళ్లాల్సిందే..

రోజుకు మూడు రంగులు:

ధోల్‌పూర్‌లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం రోజు మూడుసార్లు రంగులు మారుస్తుంది.  ఉదయంవేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో..  సాయంత్రం వేళ చామర ఛాయగా (నీలం) రంగుల్లోకి మారి.. భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకూ ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి మరీ.. రంగులను మార్చే శివలింగాన్ని చూసి తరించిపోతారు.

ఇవి కూడా చదవండి

ఆలయ విశిష్టత:

ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. పంచ లోహాలతో తయారుచేశారు. ఇక్కడి పురాణ కధనం మేరకు.. ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు  తేనెటీగలు దాడి చేశాయట. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది. ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు. అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివ లింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు. దీంతో తవ్వే పనిని నిలిపివేశారు. ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం  శివలింగం స్వయం భూ కదా ? మరి అది ఎంత లోతు ఉందొ చూడాలని గతంలో రాజులు, చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వేకొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటం తో వారు ఆ పనిని నిష్క్రమించారు.

మహిమ కలిగిన ఆలయం: 

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామివారిని  సందర్శించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ఇది మాత్రమే కాదు.. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడ పూజలు వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట. పెళ్లికాని వారు 16 సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే.. శివుడి అనుగ్రహంతో పెళ్ళికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయట.

ఎలా చేరుకోవాలంటే.. 

రాజస్థాన్ లోని అన్ని ప్రధాన పట్టణాలనుండి ధోల్పూర్ కు బస్సులు ఉన్నాయి. ధోల్పూర్ రైల్వే జుంక్షన్ మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు వెళుతుంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..