AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Uday 2023: మార్చిలో కుంభరాశిలో శని ఉదయం , ఈ రాశులపై అనుగ్రహం .. పట్టిందల్లా బంగారమే

జనవరి 17, 2023న శని గ్రహం కుంభరాశిలో ప్రవేశించి, జనవరి 30, 2023లో కుంభరాశిలో అస్తమించిన శని.. మార్చి 6, 2023 శనివారం రాత్రి 11.36 గంటలకు కుంభరాశిలో శని ఉదయించనున్నాడు. శనీశ్వరుడు ఉదయించడం వల్ల కొందరికి విశేష లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Shani Uday 2023: మార్చిలో కుంభరాశిలో శని ఉదయం , ఈ రాశులపై అనుగ్రహం .. పట్టిందల్లా బంగారమే
Shani Uday 2023
Surya Kala
|

Updated on: Feb 19, 2023 | 8:47 AM

Share

జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడుకి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఎప్పుడైతే శనీశ్వరుడు తన రాశిని మార్చుకుంటాడో.. దాని ప్రభావం స్థానికులందరిపై పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో.. శనీశ్వరుడు న్యాయాధి పతిగా.. కర్మాను సారంగా ఫలితాలను ఇచ్చే దైవంగా  పరిగణించబడుతున్నాడు. శనీశ్వరుడు ఎవరి కుండలిలో శుభ స్తానంలో ఉంటే వారికి శుభ ఫలితాలను ఇస్తాడు.. అయితే కుండలిలో శని అశుభంగా ఉంటే.. ఆ వ్యక్తి అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. దీని ప్రభావం మార్చి ప్రారంభంలో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి శని గ్రహోదయంతో ప్రత్యేక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. శనీశ్వరుడు అన్ని గ్రహాలలో నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా పరిగణించబడుతుంది. కనుక ఆ రాశులపై శుభ,  అశుభ ప్రభావాలు చాలా కాలం పాటు ఉంటాయి. శనీశ్వరుడు కుంభం, మకర రాశికి అధిపతి. తులారాశిలో ఉన్నప్పుడు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. జనవరి 17, 2023న శని గ్రహం కుంభరాశిలో ప్రవేశించి, జనవరి 30, 2023లో కుంభరాశిలో అస్తమించిన శని.. మార్చి 6, 2023 శనివారం రాత్రి 11.36 గంటలకు కుంభరాశిలో శని ఉదయించనున్నాడు. శనీశ్వరుడు ఉదయించడం వల్ల కొందరికి విశేష లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏయే రాశుల వారికి శనీశ్వరుడు ఉదయించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

  1. వృషభ రాశి: ఈ రాశి వారికి శనీశ్వరుడు ఉదయించడం వల్ల చాలా శుభ సమయంగా పరిగణించబడుతుంది. గరిష్ట లాభం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు.. ప్రణాళికలలో పురోగతికి అవకాశం ఉంది. నిలిచిపోయిన పని వీలైనంత త్వరగా పూర్తవుతుంది. దీని కారణంగా ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితిలో బలమైన పెరుగుదల ఉంటుంది. ఒకేసారి అనేక అవకాశాలను పొందుతారు. సమాజంలో గౌరవం, కీర్తి లభిస్తుంది.
  2. సింహరాశి: కుంభరాశిలో శని ఉదయించడం సింహ రాశి వారికి శుభ సంకేతం. సూర్యుడు సింహ రాశిని పాలించే గ్రహం. అటువంటి పరిస్థితిలో.. శనీశ్వరుడు ఉదయించడం గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. కొత్త అవకాశాలను సాధించడంతో పాటు.. ఆనందం,శ్రేయస్సుకు మార్గం తెరుస్తుంది. మీరు గత కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తున్న ప్రతిదాన్ని మార్చి నెలలో సాధించే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.
  3. కుంభ రాశి: కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు. మార్చి నెలలో ఈ రాశిలో శనీశ్వరుడు అస్తమించి..ఈ రాశిలో మళ్లీ ఉదయించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మొత్తం 12 రాశులలో ఏదైనా ఒక రాశికి గరిష్ట ప్రయోజనం లభిస్తే.. అది కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి మార్చి నెలలో అనేక అవకాశాలు కలిసివస్తాయి. అద్భుతమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ నెలలో మీరు అకస్మాత్తుగా డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలను పొందే అవకాశం ఉంది. చెడిపోయిన లేదా ఆగిపోయిన పని త్వరలో పూర్తవుతుంది.
  4. మీనరాశి: మీన రాశి వారికి శని ఉదయించడం లాభదాయకంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా కొన్ని లేదా ఇతర సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మార్చి నెల చాలా మంచి రోజులు తెస్తుంది. సుఖ సంపద విందు విలాసాలతో గడుపుతారు. ధార్మిక , శుభ కార్యక్రమాలలో మీరు పాల్గొనడం వలన శాంతి లభించిన అనుభూతి కలుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి