AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. మే 31న జరిగే మహా కుంబాభిషేకానికి రానున్న ప్రధాని మోడీ

అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రాల్లో ఆరవది. శ్రీగిరి, సిరిగిరి గా పిలుచుకునే శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ట్రైన్, ఎయిర్ కనెక్టివిటీపై ఎమ్మెల్యే శిల్పా కీలక సమాచారం పంచుకున్నారు. 

Srisailam: శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. మే 31న జరిగే మహా కుంబాభిషేకానికి రానున్న ప్రధాని మోడీ
Srisaialam
Surya Kala
|

Updated on: Feb 19, 2023 | 8:04 AM

Share

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ శైలక్షేత్రం. నల్లమల అడవులలో కొలువైన శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో  శ్రీశైలం రెండవది..  అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రాల్లో ఆరవది. శ్రీగిరి, సిరిగిరి గా పిలుచుకునే శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ట్రైన్, ఎయిర్ కనెక్టివిటీపై ఎమ్మెల్యే శిల్పా కీలక సమాచారం పంచుకున్నారు. శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం.  ఈ శైవ క్షేత్రం శ్రీశైలానికి త్వరలో మహార్ధశ రాబోతుందన్నారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. శ్రీశైలంకి రోడ్, ట్రైన్, ఎయిర్ కనెక్టివిటీ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీవీ9తో ప్రత్యేకంగా చెప్పారు ఎమ్మెల్యే శిల్పా.

దేశంలో ఏ దేవాలయానికి లేనన్ని భూములు శ్రీశైలం దేవస్థానానికి ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే శిల్పా. 5300 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ రెడీ అయితే తిరుమల తరహాలో శ్రీశైలంకి ప్రత్యేక ప్రతిపత్తి అంశంపై చర్చిస్తామన్నారు. రానున్న రోజుల్లో సామాన్య భక్తులతో పాటు vvip లను శ్రీశైలంకి దగ్గర చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మే 31న జరిగే మహా కుంబాభిషేకానికి ప్రధాని మోడీ వస్తున్నారని చెప్పారు. త్వరలో శ్రీశైలానికి కర్ణాటక ముఖ్యమంత్రి, సీఎం జగన్‌లు వస్తారని చెప్పారు.

శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయి. ప్రకృతి అందాలతో కనులవిందు చేసే అనేక అందాలు శ్రీశైలం సొంతం. సిఖరేశ్వరం, హెవెన్, హటకేశ్వర స్వామి, పాలధార, పంచధార, సాక్షి గణపతి, శివాజీ స్ఫూర్తి కేంద్రం, పాతాళ గంగ, చెంచు లక్ష్మీ ట్రైబల్ మ్యూజియం, రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వంటి అనేక చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు, మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..