TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి వేచిఉన్న భక్తులు.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి..

కలియుగ వైకుంఠ దైవం.. తిరుమలేశుడి సన్నిధిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో..

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి వేచిఉన్న భక్తులు.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి..
Tirumala Temple
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2023 | 7:39 AM

కలియుగ వైకుంఠ దైవం.. తిరుమలేశుడి సన్నిధిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 14 నిండిపోయాయి. సర్వదర్శనానికి 19 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని 65,633 మంది భక్తులు దర్శించుకోగా 23,352 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా.. స్వామివారి హుండీకి రూ. 3.68 కోట్లు ఆదాయం వచ్చింది. శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మరోవైపు.. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. శనివారం వేకువజామున 2గంటల నుంచి రాత్రి వరకు శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. స్వయంభువుగా వెలసిన వాయు లింగేశ్వరస్వామి నిత్యాభిషేక మూర్తిగా భక్త జనానికి దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారు నంది వాహనం, జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనంపై అధిరోహించి పురవిహారం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లను సుమారు లక్షన్నర మంది భక్తులు దర్శించుకుని ఉంటారని అధికారులు అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!