Soar throat: గొంతులో కిచ్ కిచ్.. ఇంటి చిట్కాలతో ఇక చెక్.. మీరూ ట్రై చేయండి..
ఈ గొంతు కిచ్ కిచ్ కు వీలైనంత త్వరగా చెక్ పెట్టాలి. అందుకు వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. మీ ఇంటి దగ్గర నుంచే చక్కగా దీనిని అదుపు చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం రండి..
గొంతులో కిచ్ కిచ్.. సమస్య చిన్నదే కానీ, దాని వల్ల కలిగే ఇబ్బంది, చికాకు భరించడం కష్టమవుతుంది. మాటిమాటికీ గొంతు సవరించుకోవడం.. తన్నుకొస్తున్న కఫాన్ని మింగలేక, కక్కలేక పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పోనీ వైద్యునికి వద్దకు వెళ్దామా అంటే అంత తీవ్రత కూడా లేదని అనిపిస్తుంటుంది. అయితే దానిని దీర్ఘకాలం ఉంచితే మాత్రం సమస్య తీవ్రతరం అవుతుంది. అందుకే గొంతు గరగరకు చెక్ పెట్టాల్సిందే. అసలు గొంతులో కిచ్ కిచ్ ఎందుకు వస్తుందంటే శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వాటిపై మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పోరాడుతోంది. ఈ క్రమంలోనే మ్యూకస్ (కఫం లేదా శ్లేష్మం) ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది. జలుపు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి కూడా గొంతు గరగరకు దారితీస్తాయి. అందుకే ఈ గొంతు నొప్పిని వీలైనంత త్వరగా చెక్ పెట్టాలి. అందుకు వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. మీ ఇంటి దగ్గర నుంచే చక్కగా దానిని అదుపు చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం రండి..
ఆపిల్ సైడర్ వెనిగర్.. ఇది ఒక సహజ ఆరోగ్య రిఫ్రెషర్, ఇది శతాబ్దాలుగా ఔషధ నివారణలలో ఉపయోగించబడుతోంది. దీనిలోని ప్రధాన పదార్థం ఎసిటిక్ యాసిడ్, ఇది బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. చాలాకాలం నుంచి ఫ్లూ లక్షణాలు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి చికిత్స చేయడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను వైద్యులు సూచిస్తున్నారు.
తేనె.. ఇది ఒక రుచికరమైన స్వీటెనర్. గొంతు నొప్పిని తగ్గించడానికి ఇతర సహజ పదార్ధాలతో కలిపి దీనిని ఉపయోగించవచ్చు. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడడంతో పాటు నొప్పి నివారణకు సాయపడుతుంది.
గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి.. ఒక కప్పు గోరువెచ్చని నీరు,1/4 టీస్పూన్ ఉప్పుతో కలిపి పుక్కిలించండి. మీ గొంతు నొప్పిగా లేదా దురదగా ఉన్నప్పుడు మీరు దీన్ని చేయవచ్చు. ఉప్పును ఉపయోగించడం వల్ల మీ గొంతు కణజాలం ద్రవాన్ని విడుదల చేస్తుంది, ఇది వైరస్ లను నివారిస్తుంది. కఫం అడ్డు పడకుండా నియంత్రిస్తుంది.
దాల్చిన చెక్క.. ఇది యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే రుచికరమైన మసాలా. ఇది యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి వాటికి మంచి ఔషధం. గొంతు నొప్పిని తగ్గించడానికి కూడా దీనిని వినియోగిస్తారు. దాల్చిన చెక్క టీ మరొక రుచికరమైన ఎంపిక. మీరు దాల్చిన చెక్క బాదం పాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మీ గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు లేదా ఫ్లూ కారణంగా గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి దాల్చిన చెక్క సహాయపడుతుంది.
మెంతులు.. ఇవి మీరు అనేక రూపాల్లో ఉపయోగించే ఒక ఔషధం. మెంతి గింజలు, నూనెను వాడొచ్చు. లేదా టీలో కలిసి తీసుకోవచ్చు. గొంతు నొప్పిని నయం చేయడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన సాధనం. మెంతులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..