Mukesh Ambani: సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న ముఖేష్ అంబానీ.. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు..
మహాశివరాత్రి సందర్భంగా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
మహా శివరాత్రి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కొడుకు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీతో కలిసి శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ట్రస్టు తరపున ఆయనకు ట్రస్టు అధ్యక్షుడు పి.కె. లాహిరి, కార్యదర్శి యోగేంద్రభాయ్ దేశాయ్ వీరికి స్వాగతం పలికారు. అనంతరం సోమేశ్వరుడి అభిషేకం చేసి పూజలు చేశారు. శివునికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు కూడా చేశారు. సోమనాథుడిని దర్శించుకోవడంతో పాటు, సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు ముఖేష్ అంబానీ 1.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అంబానీ కుటుంబం సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా అంబానీ పూజలు చేసి భారీ విరాళాలను అందించారు. ముఖేష్ అంబానీ 1.5 కోట్ల రూపాయల విరాళాన్ని ఆలయానికి విరాళాన్ని ఇచ్చారు.
సోమనాథ్ ఆలయం ప్రత్యేకతలు
సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. ఇది అతి ప్రాచీనమైనది, పురాణప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని “ప్రభాస తీర్థం” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. చారిత్రక ఆధారాలద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్ధానికి చెందినది.స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు.
ఆలయాన్ని నిర్మించినది..
సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం. ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. ఆరు మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు.
చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం