Hyderabad: న్యాయం కోసం లంచం ఇవ్వలేను అంటూ రైతు వినూత్న నిరసన.. తనని ఉరి తీయాలని విజ్ఞప్తి

తనకు జరిగిన అన్యాయంపై వినూత్న రీతిలో నిరసన తెలిపాడు ఓ రైతు. డీజీపీ తనకు ఉరి వేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ వింత నిరసన భాగ్యనగరం నడి బొడ్డున చోటు చేసుకుంది.   

Hyderabad: న్యాయం కోసం లంచం ఇవ్వలేను అంటూ రైతు వినూత్న నిరసన.. తనని ఉరి తీయాలని విజ్ఞప్తి
Farmer Protest
Follow us
Surya Kala

|

Updated on: Feb 18, 2023 | 9:50 AM

న్యాయం కోసం రైతు వినూత్న రీతిలో నిరసనకు దిగాడు ఓ రైతు. హైదరబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుండి నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా, ఉరి తాడు చేతపట్టుకొని డిజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వచ్చాడు. నిరసన తెలిపాడు బాధిత రైతు గట్ల సురేందర్. వరంగల్ జిల్లా పోనకల్ గ్రామానికి చెందిన సురేందర్ భూమిని స్థానిక టిఆర్ఎస్ నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి.. తన తమ్ముడికి రాయించారని ఆరోపిస్తున్నాడు రైతు. పోలీసులను ఉన్నతాధికారులను కలిసినా న్యాయం జరగలేదని చెప్తున్నాడు రైతు సురేందర్.

వారు సృష్టించిన దొంగ పత్రాలను మీరే పరిశీలించాలని డీజీపీ కోరుతున్నారు సురేందర్. వారు సృష్టించిన పత్రాలు సరైనవి అయితే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఊరి తీయాలని కోరుతున్నాడు బాధిత రైతు. ఈ విషయంలో గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర డీజీపీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు రైతు సురేందర్. వినతిపత్రం అందజేసేందుకు బాధిత రైతును డీజీపీ కార్యాలయంలోకి అనుమతించలేదు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..