Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 10 డబుల్ డెక్కర్ బస్సులు. ఈ మార్గోల్లోనే.?
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులకు ఎంతటి చారిత్రక ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్‌కు వచ్చిన వారు కచ్చితంగా డబుల్ డెక్కర్ బస్సు ఎక్కే తిరిగి వెళ్లాలనే ఆలోచనలో ఉండేవారు. నిజం హయాంలో ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్సులు 2003 వరకు...
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులకు ఎంతటి చారిత్రక ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్‌కు వచ్చిన వారు కచ్చితంగా డబుల్ డెక్కర్ బస్సు ఎక్కే తిరిగి వెళ్లాలనే ఆలోచనలో ఉండేవారు. నిజం హయాంలో ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్సులు 2003 వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ తర్వాత క్రమంగా వీటిని పక్కనబెట్టారు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు మళ్లీ డబుల్ డెకర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హైదరబాద్‌లో ఇప్పటికే మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టగా.. ఫార్ములా ఈ-రేసింగ్ సందర్భంగా వాటిని నగర రోడ్లపై తిప్పారు. ఈ బస్పులను త్వరలోనే చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో నడపనున్నారు. అయితే ఈ క్రమంలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ డబుల్ డెకర్ బస్సులను నడిపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో మరో 10 డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ బస్సులను ఏ మార్గంలో నడిపించాలన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం. డబుల్ డెక్కర్ బస్సులను మెట్రో మార్గం, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు లేని మార్గాల్లో నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..