Viral Video: డీజీపీ తండ్రికి ట్రైనీ ఐపీఎస్‌ కూతురు సెల్యూట్‌.. ఇదికదా పుత్రికోత్సాహం.. ఇద్దరికీ ఇవి మరుపురాని క్షణాలు అంటున్న నెటిజన్లు

డీజీపీ అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ ఐపీఎస్‌గా ఎదురొచ్చి సెల్యూట్‌ చేస్తే.. ఆ మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేం. అసోం రాష్ట్రానికి డీజీపీగా ఉన్న జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌ కూతురు ఐశ్వర్య సింగ్‌ ఇటీవల ఐపీఎస్‌ శిక్షణను పూర్తి చేసుకుంది.

Viral Video: డీజీపీ తండ్రికి ట్రైనీ ఐపీఎస్‌ కూతురు సెల్యూట్‌.. ఇదికదా పుత్రికోత్సాహం.. ఇద్దరికీ ఇవి మరుపురాని క్షణాలు అంటున్న నెటిజన్లు
Ips Daughter Dgp Father
Follow us

|

Updated on: Feb 14, 2023 | 10:10 AM

పిల్లలు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు…  ప్రజలు ఆ పిల్లలను మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుందని నాడు సుమతి చెప్పిన విషయానికి నేడు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఘటన. తమ కన్నబిడ్డలు ఉన్నత స్థితికి చేరుకుని, ఆ బిడ్డలను అందరూ పొగడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల జన్మధన్యమైందని ఫీలవుతారు. నిజమైన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. కన్నబిడ్డలు తమకంటే ఉన్నతస్థానంలో స్థిరపడితే చూడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే, డీజీపీ అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ ఐపీఎస్‌గా ఎదురొచ్చి సెల్యూట్‌ చేస్తే.. ఆ మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేం. అసోం రాష్ట్రానికి డీజీపీగా ఉన్న జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌ కూతురు ఐశ్వర్య సింగ్‌ ఇటీవల ఐపీఎస్‌ శిక్షణను పూర్తి చేసుకుంది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ పూర్తయిన తర్వాత డీజీపీ హోదాలో ఉన్న తన తండ్రి జీపీ సింగ్‌కు.. ఐశ్వర్య సింగ్‌ సెల్యూట్‌ చేశారు.

ఈ అపురూప దృశ్యాన్ని వీడియో తీసిన ఎన్‌పీఎస్‌ సిబ్బంది జీపీ సింగ్‌కు పంపడంతో ఆయన ‘ఇది మాటల్లో వర్ణించలేని సందర్భం.. ట్రైనీ ఐపీఎస్‌గా నా కూతురి నుంచి సెల్యూట్‌ స్వీకరించా’ అంటూ ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట ప్రతి తల్లిదండ్రుల హృదయాలను తాకుతోంది.

ఇవి కూడా చదవండి

వేలాదిమంది ఈ వీడియోకు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ ఏడీజీ స్వాతిలక్రా వీడియోనూ చూసి స్పందించారు. ‘తండ్రీకూతుళ్లిద్దరకీ ఇవి మధుర క్షణాలు.. ఇద్దరికీ కంగ్రాట్స్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికి ఐదున్నర లక్షలమందికి పైగా వీక్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..