Viral Video: వరమాల సమయంలో ఫ్రెండ్స్ చేసిన పనికి అదిరిపడిన వరుడు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

ఓ పక్క జీజే సౌండ్లు, మరో పక్క బాణాసంచా కాల్పులతో చాలా సందడిగా ఉంది వాతావరణం. ఈ క్రమంలో వరుడు వధువు మెడలతో చక్కగా ఎంతో ప్రేమగా వరమాల వేశాడు. దానిని అందంగా కనిపించేటట్టు సర్ధుతున్నాడు.

Viral Video: వరమాల సమయంలో ఫ్రెండ్స్ చేసిన పనికి అదిరిపడిన వరుడు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Feb 18, 2023 | 1:06 PM

సాధారణంగా పెళ్లిలో సరదాలు, అల్లర్లు, చిలిపి గొడవలు సాధారణం. అప్పుడు గానీ పెళ్లి కళ రాదు. ఇటీవల ఇంటర్నెట్‌లో పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ నెటిజన్లకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజగా ఓ పెళ్లిలో వరుడ్ని ఆటపట్టిస్తూ బంధువులు అతనికి కోపం తెప్పించారు. ఆ సమయంలో వరుడి రియాక్షన్‌ చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

ఈ వీడియోలో పెళ్లి వేదికపై వధూవరుల జయమాల కార్యక్రమం జరుగుతోంది. ఓ పక్క జీజే సౌండ్లు, మరో పక్క బాణాసంచా కాల్పులతో చాలా సందడిగా ఉంది వాతావరణం. ఈ క్రమంలో వరుడు వధువు మెడలతో చక్కగా ఎంతో ప్రేమగా వరమాల వేశాడు. దానిని అందంగా కనిపించేటట్టు సర్ధుతున్నాడు. ఇంతలో వెనకనుంచి ఎవరో టపాసులు పేల్చాడు. దెబ్బకు జడుసుకున్నాడు వరుడు. దాంతో అంతా ఒక్కసారిగా నవ్వేసారు. అంతే వెంటనే వెనక్కి తిరిగి కోపంగా ఆపండ్రా బాబు.. దండలో పువ్వులు రాలిపోతున్నాయి అన్నట్టుగా వారిని మందలించాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by JIYA MEENA (@jiya_9017)

పాపం ఎంతో హ్యాపీగా ఉన్న వరుడి మూడ్‌ మొత్తం మారిపోయింది.. సంతోషంగా ఉండాల్సిన అతని ముఖం కోపంగా, అసహనంగా మారిపోయింది.. మరోవైపు కెమెరామెన్‌ పిలుపు.. వరమాల వేస్తూ ఇటు చూడమని.. అంతే అతడి ఎక్స్‌ప్రెషన్‌ చూడాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షలమందికి పైగా వీక్షిస్తూ లైక్‌ చేశారు. అంతేకాదు, రకరకాల ఫన్నీకామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..