Misterious Dress: అరే ఆ యువతి ఒంటిమీద డ్రస్.. అలా ఎలా..! ట్రెండ్ అవుతున్న వీడియో..
మీరు ఫ్యాషన్ షోలు చూసే ఉంటారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు రకరకాల మోడల్స్ దుస్తులు ధరించి క్యాట్ వాక్ చేస్తుంటారు. ఒక్కోసారి ఆ డ్రస్సులు వీక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
మీరు ఫ్యాషన్ షోలు చూసే ఉంటారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు రకరకాల మోడల్స్ దుస్తులు ధరించి క్యాట్ వాక్ చేస్తుంటారు. ఒక్కోసారి ఆ డ్రస్సులు వీక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను ఆకట్టకుంటోంది. ఓ ఫ్యాషన్ షోలో ఓ యువతి వేసుకున్న డ్రస్సు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.డెన్మార్క్ కోపెన్‌హాగన్‌లో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో ఓ యువతి విచిత్రమైన డ్రస్ అందరినీ ఆకట్టుకుంది. చె నాన్నా, సైమన్ విక్ అనే ఇద్దరు డిజైనర్లు ఈ డ్రస్సును రూపొందించారు. ఫ్యాషన్ షోలో పాల్గొన్న మిగతా యువతులంతా వివిధ రకాల డ్రస్సులతో క్యాట్ వాక్ చేశారు. ఈ క్రమంలో ఓ యువతి టేబుల్ వద్ద కూర్చుని డ్రింక్ తాగుతూ ఉంది. అయితే ఆమెను మొదట ఎవరూ పట్టించుకోలేదు.. ఎందుకంటే అందరితోపాటు తనుకూడా కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిందేమో అని అనుకున్నారు. కానీ కాసేపటికి ఆ యువతి సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. అవును ఆ యువతి స్పూన్‌తో గాజు గ్లాజును కొట్టి చప్పుడు చేసింది. వెంటనే పైకి లేచి క్యాట్ వాక్ చేసింది. అయితే అప్పటిదాకా టేబుల్‌పై ఉన్న క్లాత్.. ఒక్కసారిగా యువతి ఒంటిమీదకు చేరి డ్రస్సుగా మారిపోయింది. డ్రస్సుపై ఉన్న ప్లేట్లు, గ్లాసులన్నింటినీ ఈడ్చుకుంటూ వెళ్లింది. అది చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..