- Telugu News Photo Gallery Viral photos Success Story: mangalore physically challenged parashurama is a swiggy delivery boy
Success Story: బిచ్చగాడి నుంచి స్వీగ్గి బాయ్‌గా ప్రయాణం.. ఈ యువకుడు నేటి యువతకు రోల్ మోడల్
జీవితంలో ఎవరికి కష్టం ఉండదు చెప్పండి.. ఏనుగు కష్టం ఏనుగుది.. చీమ కష్టం చీమది.. అయితే తమకు వచ్చిన కష్టాన్ని ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేవాడు నిజమైన ధీరుడు.. విజేత.. ఈ రోజు శారీరక లోపాన్ని అధిగమించి దైర్యంగా జీవిస్తున్న ఓ యువకుడు సక్సెస్ స్టోరీ మీ కోసం
Updated on: Feb 21, 2023 | 12:20 PM

శారీరక వికలాంగుడు ఆ యువకుడు పేరు పరశురాముడు.. అయితే వాస్తవానికి ఆ యువకుడు పుట్టుకతో వికలాంగుడు కాదు.. పుట్టిన ఏడాది పాటు ఆరోగ్యంగానే ఉన్నాడు. చిన్నతనంలో పరుశురాముడుకి జ్వరం వచ్చింది. దీంతో డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ కారణంగా ఒక కాలు పడిపోయింది.

భుజంపై బ్యాగ్ పెట్టుకుని, చేతుల్లో శక్తి నింపుకుని చేతులనే కాళ్లుగా చేసి నడిచే ఈ యువకుడి పేరు పరశురాముడు. పురాణాల్లో పరశురాముడు ఓ ధీరుడు. కమండలాన్ని విడిచిపెట్టి.. రాజులపై దాడి చేయడానికి పరశుని పట్టిన వీరుడు. నేటి ఈ పరశురాముడు తన శారీరక వైకల్యాన్ని అధిగమించి.. ఎవరి మీద ఆధారపడకుండా.. ఫుడ్ డెలివరీ బాయ్ గా మారి.. జీవిస్తున్న విజేత.

బీజాపూర్‌కు చెందిన పరశురాం తల్లిదండ్రులు గత 30 ఏళ్లుగా మంగళూరులో ఉంటున్నారు. పుట్టిన తర్వాత ఏడాది కాలంగా ఆరోగ్యంగా ఉన్న పరుశురాముడికి.. ఒకరోజున జ్వరం వచ్చింది. దీంతో డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ కారణంగా ఒక కాలు పడిపోయింది. మరో కాలు కాస్త బలంగా ఉన్నప్పటికీ జీవితాంతం అంగవైకల్యానికి గురయ్యాడు.

9వ తరగతి వరకు చదివిన పరశురాముడు ఆ తర్వాత ఇంట్లో పేదరికం కారణంగా బిచ్చగాడిగా మారాడు. అయితే తాను ఒకరి ముందు చేయి చాచి అడుక్కోవడం అవమానంగా భావించాడు. దీంతో తాను కూడా కష్టపడి పనిచేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఒకరి ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సెక్యూరిటీ గా చేస్తూనే ఖాళీ సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.

పరశురాం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఫుడ్ డెలివరీ అవతారం ఎత్తేవాడు. ఇందుకోసం ప్రభుత్వ పథకంలో వచ్చిన ద్విచక్ర వాహనంతో స్విగ్గీ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేయడం ప్రారంభించాడు.

నేటి సమాజంలో శారీరకంగా ఫిట్‌గా ఉన్నా, చదువు , అన్ని సదుపాయాలున్నా..ఇంకా తమకు ఏదో తక్కువ అయింది అనే నిరాశతో బతికేస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి నేటి యువతకు ఆదర్శం ఈ పరశురాముడు.

పరశురాం ఫుడ్ డెలివరీ చేస్తున్న సమయంలో మంగళూరు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఎంత ఉన్న తమకు ఏమీ లేదు.. ఏమి చేయాలి అనుకుంటూ నిరంతరం నిరాశతో బతికేవారికి ఆదర్శం ఈ పరశురాముడు.





























