Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Arms Import: ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్.. ప్రపంచంలో తొలి ఐదు దేశాలు ఇవే..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్‌ దూసుకుపోతోంది. 2013-17తో పోలిస్తే 2018-22లో ఈ దిగుమతులు 11 శాతం మేర తగ్గాయి. అయినప్పటికీ కూడా భారత్ ఆయుధ దిగుమతిదారులో మళ్లీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది.

India Arms Import:  ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్.. ప్రపంచంలో తొలి ఐదు దేశాలు ఇవే..
Indian Defence
Follow us
Aravind B

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 14, 2023 | 11:34 AM

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్‌ దూసుకుపోతోంది. 2013-17తో పోలిస్తే 2018-22లో ఈ దిగుమతులు 11 శాతం మేర తగ్గాయి. అయినప్పటికీ కూడా ఇతర దేశాలతో పోల్చితే భారత్ ఆయుధ దిగుమతుల్లో మళ్లీ మొదటి స్థానంలోనే  కొనసాగుతోంది. రక్షణ కొనుగోళ్ల ప్రక్రియలో సంక్లిష్టత, భిన్న సరఫరాదారుల నుంచి సమీకరణకు ప్రయత్నాలు, స్వదేశీ డిజైన్లకు ప్రాధాన్యం వంటి వాటి వల్లే ఆయుధ దిగుమతి తగ్గుదలకు కారణం అవుతున్నాయి . స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రీ) తన తాజా నివేదికలో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 2018-22లో ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా అమెరికా కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, ఫ్రాన్స్‌, చైనా, జర్మనీలు ఉన్నాయి.

సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచలోనే 8 వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పాకిస్థాన్ ఉంది. అయితే 2018-22 కాలంలో ఆ దేశ అస్త్ర దిగుమతులు 14 శాతం తగ్గాయి. ప్రధానంగా చైనా నుంచే వీటిని కొంటోంది. 013-17తో పోల్చినప్పుడు 2018-22లో ఫ్రాన్స్‌ ఆయుధ ఎగుమతులు 44 శాతం పెరిగాయి. 2018-22లో ఫ్రాన్స్‌ ఆయుధ ఎగుమతుల్లో 30 శాతాన్ని భారత్‌ అందుకుంది. దీంతో అమెరికాను తోసి మన దేశానికి రెండో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఫ్రాన్స్‌ నిలిచింది. మొదటిస్థానంలో రష్యా ఉంది. అయితే ఆ దేశం నుంచి భారత్‌కు అందుతున్న ఆయుధాలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్‌లో రష్యా ఎగుమతులు తగ్గుతుండగా ఫ్రాన్స్‌ వాటా పెరుగుతోంది. 2018-22లో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 33 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. రష్యా వాటా 22 నుంచి 16 శాతానికి తగ్గింది.

2021 చివరి వరకూ ఉక్రెయిన్‌ ఆయుధ దిగుమతులు చాలా స్వల్పంగా ఉండేవి. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ దేశంపై రష్యా యుద్ధానికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రష్యాను ఎదుర్కొనేందుకు ఆయుధాలు అవసరం కావడంతో వివిధ దేశాల నుంచి అస్త్రాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. దీంతో 2022లో ప్రపంచంలోనే మూడో పెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్‌ నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.