H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్.. మొత్తం ముగ్గురు మృతి.. ఇతర వ్యాధులున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వైద్యుల ప్రకారం..  H3N2 వైరస్.. A ఉప రకం. ఈ వైరల్ ప్రస్తుతం చురుకుగా మారింది..చాలా వేగంగా వ్యాపిస్తోంది.

H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్.. మొత్తం ముగ్గురు మృతి.. ఇతర వ్యాధులున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
H3n2 Virus
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2023 | 9:29 AM

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా  H3N2 వైరస్ (ఫ్లూ)  చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో మూడో మరణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ 58 ఏళ్ల మహిళ మృతి చెందింది. వైద్యుల ప్రకారం  మహిళ ఇప్పటికే అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతోంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న రోగికి.. వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు.

ఈ వైరస్ కారణంగా హర్యానా, కర్ణాటకలో ఇప్పటికే ఇద్దరు రోగులు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వైద్యుల ప్రకారం..  H3N2 వైరస్.. A ఉప రకం. ఈ వైరల్ ప్రస్తుతం చురుకుగా మారింది..చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌తో బాధపడేవారిలో జలుబు, బాడీ పెయిన్స్ ప్రధాన లక్షణాలు.. అయితే ఆ వైరస్ క్రమంగా రోగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.

ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, వృద్ధులు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్‌తో బాధపడుతున్న రోగులకు సకాలంలో వైద్యం అందకపోతే.. బాధితుల ప్రాణాలు కూడా పోతాయి. సరైన సమయంలో వైద్య చికిత్స అందించాలి. చికిత్స అందించే విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. H3N2 వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించి తగిన చికిత్సనందించాలి.

ఇవి కూడా చదవండి

పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్న వైద్యులు  డాక్టర్ అరుణ్ షా ప్రకారం..  ఫ్లూ వ్యాక్సిన్ H3N2 వైరస్‌ను నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీకా శరీరంలో రోగనిరోధక శక్తిని  తయారు చేస్తుంది. బలహీనమైన పిల్లలు, రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు, వృద్ధులకు వ్యాధితో పోరాడడంలో టీకా సహాయపడుతుందని అరుణ్ షా పేర్కొన్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని డాక్టర్ షా అభిప్రాయపడ్డారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

వైద్యుల ప్రకారం, ఈ వైరస్‌తో బాధపడుతున్న రోగులలో జ్వరం, కఫం, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటాయి. దీనితో పాటు, రోగులు శరీర నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!