Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఎక్స్‌ప్రెస్‌వేపై పేలిన కారు టైర్.. ఆరుగురు ప్రయాణీకులు మృతి..
శివని పిసా గ్రామంలో ఉదయం ఎనిమిది గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు ఔరంగాబాద్ నుంచి షెగావ్ వైపు వెళ్తుండగా టైరు పేలిపోయింది. ఒక్కసారిగా టైరు పగిలిన శబ్దం పెద్దగా వినిపించడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై హఠాత్తుగా కారు టైరు మిగలడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం శివని పిసా గ్రామంలో ఉదయం ఎనిమిది గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు ఔరంగాబాద్ నుంచి షెగావ్ వైపు వెళ్తుండగా టైరు పేలిపోయింది. ఒక్కసారిగా టైరు పగిలిన శబ్దం పెద్దగా వినిపించడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. పరుగు పరుగున ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ కారు ప్రమాదానికి గురైకనిపించింది.
కారులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా కారు యజమానిని గుర్తిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు సమాచారం అందించినట్లు అధికారి తెలిపారు. ప్రమాదానికి టైరు పగిలిపోవడమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలపై పోలీసు బృందం దర్యాప్తు చేస్తోంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆ తర్వాతే బంధువులకు అప్పగించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..