AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైర్‌ పేలితే యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు.. సాకులు చెప్పొద్దు.. బీమా కంపెనీని మందలించిన హైకోర్టు

Bombay High Court: ఇన్సూరెన్స్ కంపెనీ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టి వేసింది. బాధితుడి కుటుంబానికి తక్షణమే రూ.1.25 కోట్లు చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ ఈ బీమా కంపెనీని ఆదేశించింది.

టైర్‌ పేలితే యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు.. సాకులు చెప్పొద్దు.. బీమా కంపెనీని మందలించిన హైకోర్టు
High Court
Balaraju Goud
|

Updated on: Mar 12, 2023 | 4:12 PM

Share

నష్టపరిహారానికి వ్యతిరేకంగా భీమా సంస్థ అభ్యర్థనను ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. టైర్ పంక్చర్ అయ్యి ఓ కారుకి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు పరిహారం కోసం బీమా కంపెనీని ఆశ్రయించగా కుదరదని తేల్చి చెప్పింది సదరు ఇన్సురెన్స్ కంపెనీ. పైగా ఈ విషయాన్ని తేల్చుకునేందుకు బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. అది యాక్ట్ ఆఫ్ గాడ్ కిందకు వస్తుందని, పరిహారం ఇవ్వలేమని తెలిపింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్‌డీ దిగే నేతృత్వంలోని బాంబే హైకోర్టు ధర్మాసనం.. కోర్టు టైర్ బరస్ట్‌ అనేది గాడ్ ఆఫ్ యాక్ట్ కాదని, కచ్చితంగా అది మానవ నిర్లక్ష్యమేనని స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీ వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. బాధితుడి కుటుంబానికి తక్షణమే రూ.1.25 కోట్లు చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ ఈ బీమా కంపెనీని ఆదేశించింది.

వాహనాలున్న వాళ్లు కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలేనిది వెహికిల్ యాక్ట్‌లోని రూల్. ఏదైనా ప్రమాదాలు జరిగి వాహనం ధ్వంసమైతే రిపేర్‌ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. అయితే…కొన్ని బీమా సంస్థలు రకరకాల రూల్స్ చెప్పి పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలోనే విచారణ జరిపిన బాంబే హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది.

అక్టోబరు 25, 2010న మకరంద్ పట్వర్ధన్ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి పూణె నుండి ముంబైకి వెళుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు వెనుక చక్రం పగిలి కారు లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో 38ఏళ్ల మకరంద్ పట్వర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మకరంద్ పట్వర్ధన్ కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక సభ్యుడు. ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోయినందున పరిహారం అందాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఇన్సురెన్స్ కంపెనీ మాత్రం అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేమని చెబుతోంది. టైర్ పేలిపోవడానికి రకరకాల కారణాలుంటాయని, దాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్‌గా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ప్రయాణం చేసే ముందే టైర్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలని, ఇది సహజంగా జరిగిన ప్రమాదం కాదని.. నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని తేల్చి చెప్పింది. పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు దీన్ని ఓ సాకుగా చూపించడం సరికాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.