Bull Bribe: సీఎం ఇలాకాలలో వింత ఘటన.. లంచం డిమాండ్ చేసిన ఆఫీసర్.. డబ్బులు ఇవ్వలేక ఎద్దుని తీసుకోమన్న రైతు

కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై సొంత జిల్లా హవేరిలో ఈ వింత ఘటన జరిగింది. జిల్లాలోని సవనూర్‌ మున్సిపాలిటీ ఆఫీసుకు ఎల్లప్ప అనే రైతు తన ఎద్దుని తీసుకుని వచ్చాడు. అంతేకాదు ఆ ఎద్దును ఆఫీసు మెయిన్ డోర్ దగ్గర ఉన్న స్తంభానికి కట్టేశాడు. అనంతరం లంచానికి బదులుగా ఈ ఎద్దుని తీసుకోమని ఆఫీసర్ ను కోరాడు. 

Bull Bribe: సీఎం ఇలాకాలలో వింత ఘటన.. లంచం డిమాండ్ చేసిన ఆఫీసర్.. డబ్బులు ఇవ్వలేక ఎద్దుని తీసుకోమన్న రైతు
Bull Bribe
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2023 | 9:02 AM

నిజమైన బిచ్చగాడు ఎవరంటే పేదవారి నుంచి లంచాలను తీసుకునే ప్రభుత్వ అధికారులు అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ప్రజల సేవ చేయడానికి ఉన్న అధికారులు.. ఏ చిన్న పని చేయాలన్నా ఎదుటివారు ఎవరైనా సరే బల్ల కింద చేయిపెడతారు. చేతిలో డబ్బులు పెడితే.. మీ పని ముందుకు వెళ్తుంది అంటూ తన వద్దకు వచ్చిన వారిని డిమాండ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. ఓ రైతు మున్సిపల్ రికార్డ్స్ లో మార్పులు చేసుకోవాలని మున్సిపల్ ఆఫీస్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ తన పని జరగాలంటే.. లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేశాడు. అయితే అంత డబ్బులు ఇచ్చే స్తొమత లేని రైతు సహనం నశించింది. అధికారి అడిగిన లంచం ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేవని.. అయితే డబ్బులకు బదులుగా ఎద్దుని ఇస్తానని చెప్పాడు. అంతేకాదు తన ఎద్దుని నేరుగా మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు తీసుకుని వెళ్లి ఒక్కడా ఉన్న ఓ స్థంబానికి కట్టేశాడు. ఈ వింత ఘటన కర్ణాటక లో చోటు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై సొంత జిల్లా హవేరిలో ఈ వింత ఘటన జరిగింది. జిల్లాలోని సవనూర్‌ మున్సిపాలిటీ ఆఫీసుకు ఎల్లప్ప అనే రైతు తన ఎద్దుని తీసుకుని వచ్చాడు. అంతేకాదు ఆ ఎద్దును ఆఫీసు మెయిన్ డోర్ దగ్గర ఉన్న స్తంభానికి కట్టేశాడు. అనంతరం లంచానికి బదులుగా ఈ ఎద్దుని తీసుకోమని ఆఫీసర్ ను కోరాడు.

సావనూరుకు చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు మున్సిపల్‌ రికార్డుల్లో ఇంటి అడ్రస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ఓ అధికారికి లంచం ఇచ్చాడు. అయితే ఆ రైతు పని పూర్తి కాకుండానే ఆ అధికారి మారారు. కొత్త అధికారి వచ్చాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ తన పని చేయమంటూ మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళాడు. రూ. 25,000 లంచం ఇవ్వమని ఆ రైతును ప్రభుత్వ అధికారి డిమాండ్ చేశాడు. డబ్బులు లేక   నిస్సహాయుడుగా మారిన ఎల్లప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేవంటూ..  తన ఎద్దును తీసుకొని మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లాడు. ఆ ఎద్దుని ఆఫీసు దగ్గర కట్టేశాడు.

ఇవి కూడా చదవండి

డబ్బుకు బదులు ఎద్దును తీసుకోవాలని అధికారులను కోరాడు. రైతు చర్యతో ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. ఆఫీసు దగ్గర ఉన్నవారు అంతా పోగయ్యారు. ఈ ఘటనపై చర్చించుకోవడం ప్రారంభించారు. చివరగా, ఒక సీనియర్ అధికారి స్పందించి ఆ రైతు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఎల్లప్పకు సంబంధించిన రికార్డుల్లో మార్పు చేస్తామని హామీ ఇచ్చారు.. ఇంటికి తిరిగి వెళ్లాలని రైతును కోరాడు. లంచం అడిగిన అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..